*సాయికృష్ణ కుటుంబాన్ని పరామర్శించిన వంగవీటి ఆశ కిరణ్
నిజాలు వెలుగులోకి వచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని హామీ
విజయవాడ, జూన్ 19:వాయిస్ టుడే
Vangaveti Asha Kiran consoles Saikrishna’s family.
కృష్ణలంకలో అదృశ్యమైన సాయికృష్ణ కుటుంబాన్ని వంగవీటి ఆశ కిరణ్, రాధా రంగా మిత్ర మండలి సభ్యులు పరామర్శించారు. సాయికృష్ణ నివాసానికి వెళ్లిన వారు కుటుంబ సభ్యులను కలిసి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా సాయికృష్ణ అదృశ్యమైన ఘటనపై కుటుంబ సభ్యుల నుంచి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్న వంగవీటి ఆశ కిరణ్, ఈ కేసు విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై కూడా ఆరా తీశారు.
అనంతరం మాట్లాడుతూ, ఈ క్లిష్ట సమయంలో రాధా రంగా మిత్ర మండలి బాధిత కుటుంబానికి అండగా నిలుస్తుందని తెలిపారు. సాయికృష్ణ అదృశ్యమైన ఘటనకు సంబంధించిన పూర్తి నిజాలు వెలుగులోకి వచ్చి, కుటుంబానికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని భరోసా ఇచ్చారు.
బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని పేర్కొన్నారు. ఈ విషయంలో సంబంధిత అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహించి వాస్తవాలను వెలికితీయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రాధా రంగా మిత్ర మండలి సభ్యులు, స్థానిక నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.




