సీఎస్ గా సంజయ్ జాజు…?

- Advertisement -

సీఎస్ గా సంజయ్ జాజు…?
హైదరాబాద్ జూన్ 24, ( వాయిస్ టుడే)

Sanjay to become Chief Secretary?
తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సీఎస్‌గా ఉన్న కె. రామకృష్ణారావు పదవీ కాలం నెలాఖరులో

ముగుస్తుంది. కొత్త సీఎస్ ఎంపికపై గత కొన్ని రోజులుగా సచివాలయ వర్గాల్లో ఉత్కంఠ నడుస్తోంది. ఈ రేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి అత్యంత నమ్మకస్తుడిగా, ఐటీ, పురపాలక శాఖల్లో కీలక

బాధ్యతలు నిర్వహిస్తున్న జయేష్ రంజన్ పేరు బలంగా వినిపించినప్పటికీ.. అనూహ్యంగా సంజయ్ జాజు వైపే ప్రభుత్వం మొగ్గు చూపినట్లు తెలుస్తోంది దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు రావడం

కేవలం లాంఛనమేనని తెలుస్తోంది.తెలంగాణ క్యాడర్‌కు చెందిన సంజయ్ జాజు 1992 బ్యాచ్‌కు చెందిన అత్యంత సీనియర్ ఐఏఎస్ అధికారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేంద్ర సర్వీసుల్లో ఆయనకు

ఉన్న అపారమైన పరిపాలనా అనుభవం ఈ కీలక పదవికి ఆయనను ఎంపిక చేయడానికి ప్రధాన కారణమైంది. గతంలో ఆయన కేంద్ర రక్షణ శాఖ అదనపు కార్యదర్శిగా, సమాచార-ప్రసార శాఖ కార్యదర్శిగా

బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం కేంద్రంలో డెవలప్‌మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ కార్యదర్శిగా దిల్లీలో డెప్యుటేషన్‌పై సేవలందిస్తున్నారు. రాష్ట్రంలో అత్యంత సీనియర్ అయిన శశాంక్ గోయల్ మరికొద్ది

నెలల్లో రిటైర్ కానుండటం, మరో సీనియర్ అరవింద్ కుమార్ సస్పెన్షన్‌లో ఉండటంతో.. క్లీన్ ఇమేజ్, అపార అనుభవం ఉన్న సంజయ్ జాజుకు లైన్ క్లియర్ అయింది.సీఎం రేవంత్ ను సంజయ్ జాజు ఢిల్లీలో

కలిశారు. ఆయనను కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ చేస్తూ కేంద్రం కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి ఏపీలో ఐటీ కార్యదర్శిగా పనిచేసిన సమయంలో.. ప్రజలకు ప్రభుత్వ సేవలను డిజిటల్ రూపంలో

చేరువ చేసిన విప్లవాత్మక మీసేవ పోర్టల్‌ను డిజైన్ చేసి, విజయవంతంగా అమలు చేసింది సంజయ్ జాజునే . ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ జాతీయ ఈ-గవర్నెన్స్ గోల్డ్ అవార్డు కూడా దక్కింది.సంజయ్ జాజు

ఎంపిక వెనుక ఉన్న మరో ప్రధాన సానుకూల అంశం.. ఆయనకు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో ఉన్న సత్సంబంధాలు. దిల్లీ సర్కిల్స్‌లో మంచి పట్టున్న అధికారి కావడం వల్ల కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన

నిధులు, అనుమతుల సాధనలో ఆయన కీలకంగా మారుతారని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికి తోడు ఆయన సర్వీస్ కాలపరిమితి 2028 మార్చి వరకు ఉండటం మరో పెద్ద అడ్వాంటేజ్. అంటే కొత్తగా

వచ్చే సీఎస్ కనీసం రెండేళ్లకు పైగా సుదీర్ఘ కాలం పదవిలో కొనసాగే అవకాశం ఉంటుంది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఎలాంటి ఆటంకాలు లేకుండా క్షేత్రస్థాయికి

తీసుకెళ్లవచ్చని రేవంత్ సర్కార్ వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular