హుషార్ పిట్టలు’ చిత్రం నుంచి ‘టోంగా..టోంగా’ పాట విడుదల
‘Tonga… Tonga’ song released from the movie ‘Hushar Pittalu’
అన్షు, వాసవి గణేషన్ జంటగా రూపొందుతోన్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘హుషారు పిట్టలు’. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్ పతాకంపై వెంకట్ యాదవ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బిక్షు దర్శకుడు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు ఏషియన్ సురేష్ ఫిలింస్ సంస్థలు విడుదల చేస్తున్నాయి. ఆగస్టు 15న ఈ చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం టీజర్‌కు అనూహ్యమైన స్పందన వచ్చింది. కాగా తాజా ఈ చిత్రం నుంచి టోంగా టోంగా అనే ఓ హుషారు గీతాన్ని బుధవారం విడుదల చేశారు. చరణ్ అర్జున్ సంగీత దర్శకత్వంలో ఎస్.ఎస్.చిరంజన్ సాహిత్యంతో, మెయిన్ కొరియోగ్రఫీతో ఈ పాట తెరకెక్కింది. ఈ సందర్భంగా
బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ ” ఈ సినిమా చూసి నేను ఎంతో ఇంప్రెస్ అయ్యాను. ఈ సినిమా చూసిన అందరూ పాజిటివ్ స్పందించారు. ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల చేయడం లక్కీగా అనుకుంటున్నాను. ఓ చిన్న సినిమాకు ఇంత మంచి డేట్ దొరకడం చాలా అరుదు. ఈ సినిమా ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం ఉంది. సినిమా తప్పకుండా హిట్ అవుతుందనే కాన్ఫిడెన్స్ ఉంది. చిన్ని చరణ్ సంగీతం ఈ సినిమాకు ఎంతో ప్లస్ అవుతుంది. ఈ రోజు విడుదల చేసిన మంగ్లీ పాట కూడా అందరికి నచ్చుతుంది. ఇక నా తదుపరి సినిమా ప్రేమ ఇష్క్ కాదల్-2 చిత్రానికి చిన్ని అర్జున్ ఎంతో అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్ర దర్శకుడు బిక్షు త్వరలో తెలుగు సినిమాలో కొంత ట్రెండ్ సృష్టించబోతున్నాడు. ఆయనకొక మార్క్ ఏర్పడుతుంది. ఈ సినిమా నిర్మాత వెంకట్‌ఎంతో పాషనెటెడ్. ఎక్కడా రాజీపడని నిర్మాత. ఓ హిట్ సినిమా తీసి మా దగ్గరికొచ్చాడు. ఈ సినిమా తప్పకుండా ఆడియన్స్ ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉంది’ అన్నారు.
చరణ్ అర్జున్ మట్లాడుతూ ”తొలిసారిగా నేను మ్యూజిక్ అందించిన చిత్రంలో ఓ సాంగ్‌కు ఈవెంట్ పెట్టడం సంతోషంగా ఉంది. ఈ పాటను ఎంతో సందడిగా, హుషారుగా చేశాం. ఈ సినిమాలో అన్ని తరహా పాటలు ఉంటాయి. ఈ చిత్ర దర్శకుడు ఎంతో రూటెడ్.. ఈ సినిమా టీజర్ విడుదలైన తరువాత ఎంతో హాట్‌టాపిక్‌గా మారింది. ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదరుచూస్తున్నారు. ఆగస్టు 15న నాకు స్పెషల్ డే. ఆ రోజు ఈ సినిమా విడుదల కావడం నాకు ఎంతో ఎమోషన్‌గా ఉంది. తెలుగు సినిమా చరిత్రలో బిక్షు ఓ రూటెడ్ డైరెక్టర్‌గా ఎదుగుతాడు. ఈ సినిమాకు పనిచేస్తున్నప్పుడు నాకు ఓ సూపర్‌హిట్ సినిమాకు పనిచేస్తున్న వైబ్ కలిగింది. ప్రేక్షకులకు కూడా అదే ఫీల్ కలుగుతుందని నమ్ముతున్నాను’ అన్నారు.
నిర్మాత వెంకట్ యాదవ్ మాట్లాడుతూ ” టీజర్ విడుదలైనప్పుడు వైరల్ అయ్యంది. కొంత మంది తెలియక బ్యాడ్ కామెంట్లు పెట్టారు. కానీ సినిమా విడుదల తరువాత ఆ సినిమాలో ఉన్న అసలు కథ అందరికి తెలుస్తుంది. అందరి హృదయాలకు హత్తుకునే సినిమా ఇది. ఈ సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. ఈ కథ చెప్పినప్పుడు చిట్టి పిల్ల, మాసినెపల్లి రవి పాత్రలు అందరిని అలరిస్తాయి. కథ తగ్గ ఆర్టిస్టులు తీసుకున్నాం. అందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఎన్నో ఒడిదొడుకుల మధ్య ఈ సినిమా నిర్మించాను. ఎంతో ఫ్రొఫెషనల్‌గా తీసిన సినిమా ఇది. ప్రముఖ నిర్మాత సురేష్‌బాబు గారు ఈ సినిమాను విడుదల చేయడం అంటేనే ఈ సినిమా ఎలాంటి సినిమానో అర్థం చేసుకొవచ్చు. ఈ సినిమా విడుదల తరువాత అందరూ ఓ మంచి సినిమా తీశామన్న అనుభూతికి లోనవుతారు. ఈ సినిమా ను విడుదల చేయడానికి బెక్కెం వేణుగోపాల్ సహాకారం మరువలేనిది. ఇది ఓ మంచి సినిమా కాబట్టే అందరూ సపోర్ట్ చేశారు. ఈసినిమాను విడుదల చేస్తున్న సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్‌బాబు గారికి నా కృతజ్క్షతలు’ అన్నారు.
దర్శకుడు బిక్షు మాట్లాడుతూ ” ఈ సినిమా టీజర్ తరువాత నన్ను అందరూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ తిట్టడం స్టార్ట్ చేసి నన్ను పాపులర్ చేశారు. అందరూ ఏదోదో ఊహించుకున్నారు. ఈ సినిమా విడుదల తరువాత సినిమా చూసి అందరూ మీరు సోషల్ మీడియాలో చేసిన నెగెటివ్ కామెంట్స్ వెనక్కి తీసుకుంటారు. అయితే ఇదే సినిమాను ఏ తమిళంలో, మలయాళంలో తీసి టీజర్‌ను విడుదల చేస్తే అందరూ ప్రశంసించేవారు. కానీ తెలుగు వాళ్లు మనకు చిన్న చూపు. తెలుగులో హుషార్ పిట్టలు ట్రెండ్ సృష్టించబోతుంది. విడుదల తరువాత ఇతర భాషల్లో ఈ తెలుగు సినిమా గురించి మాట్లాడుకుంటారు. పుట్ట చిట్టి పాత్రకు వాసవి ప్రాణం పోసింది. అందుకే ఆమె కాళ్లు మొక్కుతున్నాను. ఈ రోజు మా కాన్ఫిడెంట్‌కు కారణం ఏమిటో ఈ సినిమా విడుదల తరువాత అందరికి తెలుస్తుంది’ అన్నారు.
హీరో అన్షు మాట్లాడుతూ ” నా ఫేవరెట్ సింగర్ మంగ్లీ నా సినిమాలో పాట పాటడం ఆనందంగా ఉంది. ఈ పాటకు మంచి ట్యూన్‌ను చరన్ అర్జున్ అందించారు. ఈ రోజు నా ఆత్మవిశ్వాసానికి కారణం దర్శకుడు బిక్షు, నిర్మాత వెంకట్ గారు. టీజర్ విడుదల చేశాం. చాలా వైరల్ అయ్యింది. టీజర్ చూసి అందరూ మిస్ అండర్‌స్టాండింగ్ చేసుకున్నారు. సినిమా చూసిన తరువాత అందరి ఆలోచన మారిపోతుంది. సినిమాలో అసలైన మ్యాటర్ సినిమాలో ఉంది. నా సినిమాలో ఉన్న కంటెంట్ నాతో ఇంత కాన్ఫిడెన్స్‌ను ఇచ్చింది’ అన్నారు.
హీరోయిన్ వాసవి గణేషన్ మాట్లాడుతూ ” దర్శకుడు, నిర్మాత సజేషన్‌తో ఈ సినిమా చేశాను. సురేష్ ప్రొడక్షన్స్, బెక్కెం వేణుగోపాల్ సహకారంతో ఈ సినిమా స్ట్రాంగ్ అయ్యింది. టోంగా.,. టోంగా పాట అందరికి నచ్చుతుంది. ఈ సినిమా టీజర్‌తో నాకు చాలా నెగెటివ్ కామెంట్స్ పెట్టారు. అయితే వాసవి గణేషన్ వేరు… పుట్ట చిట్టి వేరు.. ఎవ్వరూ ఏమనుకున్నా సినిమా చూసిన తరువాత మీరు కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను’ అన్నారు.
ఈ సమావేశంలో నటులు గోవర్థన్, నవీన్, అంజిలతో పాటు డీఓపీ రుద్రసాయి, లిరిస్టిస్ ఎస్.ఎస్.చిరంజన్ తదితరులు పాల్గొన్నారు.




