ప్రెస్ క్లబ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ సదస్సు.. గవర్నర్‌కు ఆహ్వానం

- Advertisement -

ప్రెస్ క్లబ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ సదస్సు.. గవర్నర్‌కు ఆహ్వానం

Invitation to the Governor for the Press Clubs Federation of India National Conference.

హైదరాబాద్, ఆగస్టు 18: హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు జరగనున్న ప్రెస్ క్లబ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ సదస్సుకు తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ నెల 21న తాజ్ కృష్ణ హోటల్‌లో నిర్వహించే సదస్సు ప్రారంభ ఆహ్వాన విందుకు గవర్నర్ హాజరయ్యేందుకు అంగీకరించారు.

మంగళవారం లోకభవన్‌లో హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి రమేష్ వరికుప్పల నేతృత్వంలోని ప్రతినిధి బృందం గవర్నర్ శివ ప్రతాప్ శుక్లను కలిసి సదస్సుకు ఆహ్వానించింది.

జాతీయ స్థాయిలో మీడియా ఎదుర్కొంటున్న సవాళ్లు, మారుతున్న మీడియా పోకడలు, జర్నలిస్టుల బాధ్యతలు, వృత్తిపరమైన అంశాలపై గవర్నర్ సదస్సులో సందేశం ఇవ్వనున్నారు.

ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఏ. రాజేష్, జాయింట్ సెక్రటరీలు చిలుకూరి హరిప్రసాద్, వర్ధిల్లి బాపూరావు, కోశాధికారి రమేష్ వైట్ల, కార్యవర్గ సభ్యుడు ఎన్. శ్రీనివాస్ రెడ్డి తదితరులు గవర్నర్‌కు ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ డైరీని అందజేయడంతో పాటు పూల మొక్కను అందించి గవర్నర్‌ను సత్కరించారు.

దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి సీనియర్ జర్నలిస్టులు ఈ రెండు రోజుల జాతీయ సదస్సుకు హాజరుకానున్నారు. మీడియా రంగంలో ప్రస్తుత పరిస్థితులు, జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సవాళ్లు, భవిష్యత్ కార్యాచరణపై సదస్సులో విస్తృతంగా చర్చించనున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular