- Advertisement -
By ఆముదాల వెంకన్న
తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్ను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆకస్మికంగా సందర్శించి సిబ్బంది పనితీరును పరిశీలించారు. సీసీటీఎన్ఎస్ వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని, మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, రహదారి భద్రతా చర్యలను పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు. పెండింగ్ కేసుల దర్యాప్తును త్వరగా పూర్తి చేయాలని, కేసుల పురోగతిని సమీక్షించాలని తెలిపారు. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలని,పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు.
- Advertisement -




