- Advertisement -
By ఆముదాల వెంకన్న
ఖమ్మం మానస కాంప్లెక్స్ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ ప్రథమ వార్షికోత్సవాన్ని శుక్రవారం బాబురావు పెట్రోల్ బంక్ అడ్డా వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మాచర్ల తిరుమలరావును శాలువాతో సన్మానించారు. యూనియన్ అభివృద్ధికి ఐకమత్యంతో కృషి చేయాలని, సభ్యుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని పెద్దలు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు గుంజలూరి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు మేడబోయిన రమేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి మాలోత్ నేపాల్ సురేష్, వ్యవస్థాపకులు పూరండ్ల యాకయ్య తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -




