పేద ముస్లింలకు ప్రత్యేకంగా ఇళ్ల స్థలాలు కేటాయించాలి

- Advertisement -

By ఆముదాల వెంకన్న

ఖమ్మం: నిరుపేద ముస్లింలకు ప్రత్యేకంగా ఇళ్ల స్థలాలు కేటాయించాలని తంజీమ్ ఎ ఇన్సాఫ్ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. గొల్లగూడెం వక్ఫ్ భూముల్లో బోర్డు ఆదేశాల మేరకు పేదలకు స్థలాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రచార కార్యదర్శి మహమ్మద్ సలాం డిమాండ్ చేశారు. వక్ఫ్ భూముల ఆక్రమణలు, అక్రమ మట్టి తరలింపులను అరికట్టాలని కోరారు. గతంలో ఇచ్చిన దరఖాస్తులపై విచారణ జరిపి న్యాయం చేయాలని ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు యానాల సాంబశివరెడ్డి, మహమ్మద్ మజీద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular