- Advertisement -
వేములవాడ లో తృటిలో తప్పిన పెను ప్రమాదం
A big accident was narrowly missed in Vemulawada
బీభత్సం సృష్టించిన టిప్పర్ లారీ
విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టి దూసుకెళ్లిన టిప్పర్
తిప్పాపూర్ లో ఓ దుకాణంతోపాటు ఐదు బైక్ లు ధ్వంసం
ఆపే ప్రయత్నం చేసిన డ్రైవర్ రాష్ డ్రైవింగ్ తో ఆగకుండా వెళ్ళిన వైనం
దారికి అడ్డంగా భారీ గేట్లు పెట్టి ఆపే ప్రయత్నం చేసిన ఆగకుండా డ్రైవ్ చేసిన డ్రైవర్
చివరకు మూలవాగు వద్ద డివైడర్ ను ఢీకొట్టి ఆగిపోయిన టిప్పర్
అర్థరాత్రి జరిగిన ఘటనతో తృటిలో తప్పిన ప్రాణనష్టం
వేములవాడ
వేములవాడ లో తృటిలో పెను ప్రమాదం తప్పింది. టిప్పర్ డ్రైవర్ మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేసి, బీభత్సం సృష్టించాడు. అర్ధరాత్రి జరిగిన ఘటన కావడంతో దారిలో ఎవరు లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. వేములవాడ నుంచి తిప్పాపూర్ వైపు వెళ్ళె టిప్పర్
మొదట బైపాస్ రహదారి మహాలక్ష్మి వీధిలోని విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. స్థంభం విరిగి విద్యుత్ వైర్లు కిందపడ్డాయి. ఎవరు అక్కడ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. టిప్పర్ లో స్థంభం పడగా డ్రైవర్ ఆగకుండా ముందుకు దూసుకెళ్ళాడు. స్థంభం రోడ్డుపై రాక్కుంటు వెళ్ళడం నిప్పు రవ్వలు ఎగిసిపడ్డాయి. స్థానిక యువకులు పోలీసులు ఆపే ప్రయత్నం చేసిన ఆగకుండా తిప్పాపూర్ లో కదిరే రాజమల్లయ్య కన్సల్టెంట్ దుకాణంలోకి దూసుకెళ్ళింది. దుకాణంతోపాటు ఐదు బైక్ లు ధ్వంసం అయ్యాయి. అయినా ఆగకుండా వెళ్ళాడు. చివరకు పోలీసులు, యువకులు వెంబడించి దారికి అడ్డంగా భారీ గేట్లు పెట్టి ఆపే ప్రయత్నం చేసిన ఆగకుండా డ్రైవ్ చేశాడు డ్రైవర్. చివరకు డివైడర్ ను ఢీకొట్టి టిప్పర్ ఆగిపోవడంతో డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తు దిగేలా గుణపాఠం చెప్పారు. అర్థరాత్రి కావడంతో ఎవరు దారిలో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని భావిస్తున్నారు. లేకుంటే నిత్యం భక్తులతో రద్దీగా ఉండే వేములవాడలో పగటిపూట అయితే భారీగా ప్రాణనష్టం జరిగేదని భావిస్తున్నారు. మద్యం మత్తులో రాష్ డ్రైవింగ్ చేసిన డ్రైవర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
- Advertisement -