చెస్ ఛాంపియన్ సంహితకు ఉజ్వల భవిష్యత్తు

- Advertisement -

జాతీయస్థాయి గోల్డ్ మెడల్ సాధించినందుకు సన్మానించిన తెలంగాణ చేస్ అసోసియేషన్

హైదరాబాద్ నవంబర్ 10: అతిపిన్న వయసులోనే క్రీడా పట్ల ఆసక్తి పెంచుకొని నిలకడగా రాణిస్తూ జాతీయస్థాయిలో ఛాంపియన్ షిప్ సాధించిన  చెస్ క్రీడాకారిణి  సంహిత పుంగవనం ను తెలంగాణ రాష్ట్ర చెస్ అసోసియేషన్ సన్మానించింది. ఇటీవల జార్ఖండ్ లో జరిగిన 36వ జాతీయ చెస్ ఛాంపియన్షిప్ అండర్-9విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది. ఈరోజు బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన చేస్ అసోసియేషన్ అధ్యక్షుడు కే.ఎస్.ప్రసాద్ మాట్లాడుతూ, కేవలం మూడున్నర సంవత్సరాల వయసులోనే చెస్ పట్ల ఆసక్తి పెంచుకొని ప్రతి సంవత్సరం అంచలంచలుగా రాణిస్తూ రాష్ట్రస్థాయి జాతీయస్థాయిలో పతకాలు సాధిస్తున్నసంహిత పుంగవనం కు ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని ఆ క్రీడాకారిణీ ని తీర్చిదిద్దుతున్న  కింగ్స్ చెస్ అకాడమీ నిర్వాహకులను ఆయన అభినందించారు. భవిష్యత్తు చెస్ ఛాంపియన్లను తీర్చిదిద్దడంలో తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(సాట్స్ ) సహకారం మరువలేనిదని  ప్రతివారం తాము చేసే క్రీడా పోటీలు నిర్వహించుకోవడానికి సాట్స్ ఇస్తున్న సహకారంతోటే ఇటువంటి చెస్ ఆణిముత్యాలు ఛాంపియన్లుగా రాణిస్తున్నారని ఆయన అన్నారు. ఇటువంటి ఔత్సాహిక క్రీడాకారులను ప్రోత్సహిస్తే మరింత మంది ఛాంపియన్లుగా తెలంగాణ రాష్ట్రానికి తద్వారా దేశానికి మంచి ఖ్యాతిని తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కింగ్స్ చేస్తాకాడమీ నిర్వాహకులు సాకేత్  అంతర్జాతీయ ఆర్బిటర్లు ఆర్ చంద్రమౌళి,ఆర్ శ్రీరామ్   లోకేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular