Monday, May 11, 2026

చివరి దశకు ఫోన్ ట్యాపింగ్ కేసు

- Advertisement -

చివరి దశకు ఫోన్ ట్యాపింగ్ కేసు

A case of phone tapping for the final stage

హైదరాబాద్, జనవరి 20, (వాయిస్ టుడే)

ఫోన్ ట్యాపింగ్‌ కేసుపై తెలంగాణ పోలీసులు సీరియస్‌గా దృష్టిపెట్టారు. అమెరికా ఉన్న నిందితులను ఎలాగైనా ఇండియాకు రప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా నిందితులు ఏదో ఒక రూపంలో తప్పించుకుంటు న్నారు.. కేసు నమోదు తర్వాత అమెరికాకు వెళ్లిపోయారు కీలక నిందితులు ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావు. వారిని రప్పించేందుకు పోలీసులు చేయని ప్రయత్నాలు లేవు. ఎప్పటికప్పుడు తిప్పుకొడుతూ వస్తున్నారు నిందితులు… అమెరికాలో ఉన్న ఇద్దరు నిందితులు ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావులపై ఎక్స్‌ట్రడిషన్ అస్త్రాన్ని ప్రయోగించాలని నిర్ణయించుకున్నారట పోలీసులు. కరుడుగట్టిన నేరస్తులను అప్పగించే విషయంలో భారత్-అమెరికా మధ్య ఉన్న ఒప్పందాన్ని తెరపై తెచ్చారు.ఈ క్రమంలో సీఐడీ ద్వారా కేంద్ర హోంశాఖకు నివేదిక సైతం ఇచ్చినట్టు తెలుస్తోంది. అక్కడి నుంచి విదేశాంగ శాఖ ద్వారా అమెరికాకు నివేదిక వెళ్లాల్సివుంది. అమెరికా ప్రభుత్వం దీన్ని పరిగణనలోకి తీసుకుంటే కచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులు భారత్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. .అమెరికాలో ట్రంప్ సర్కార్ వచ్చిన తర్వాత  నిందితులు అప్పగింత సునాయాశమవుతుందని ఆలోచన చేస్తున్నారు పోలీసులు. ఈ వ్యవహారం వీలైనంత త్వరగా జరిగితే,  నిందితులు చిక్కడం ఖాయమని అంటున్నారు. వాళ్లు వస్తే.. తెరవెనుక సూత్రధారులు ఎవరన్నది తేలిపోనుంది. ఆపై కేసుకు ఓ ముగింపు రానుంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్