- Advertisement -
ప్రజా దర్బార్ కు వినతుల వెల్లువ
A flood of inquiries to Praja Durbar
మంగళగిరి
రాష్ట్రంలో ప్రజాపాలన అమల్లోకి వచ్చాక ప్రజలకు స్వాతంత్య్రం వచ్చినట్లు అయ్యిందని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. సోమవారం నాడు జరిగిన ప్రజా వేదిక కార్యక్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమా, ఎమ్మెల్సీ అశోక్ బాబు, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ రావు, శ్రీకాకుళం పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు కలమట వెంకటరమణ మూర్తి పాల్గోన్నారు.
దేవినేని ఉమా మాట్లాడుతఊ వైఎస్సార్సీపీ పాలనలో తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రజలు కూటమి ప్రభుత్వానికి సమస్యలు ఏకరువు పెడుతున్నారు. ప్రజలకు దూరంగా, పరదాల చాటున దాగిన గత వైసీపీ విధానాలకు స్వస్తి పలికి ప్రజలతో మమేకమై వారికి సేవ చేయటం కూటమి సర్కార్ బాధ్యతగా పెట్టుకుందని అన్నారు. ఫిర్యాదు ఏ స్థాయిలో ఉంది, పరిష్కారం అయ్యేందుకు కావాల్సిన అదనపు సమాచారం, తదితర వివరాలతో వారి ఫోన్ నెంబర్లకు మెసేజ్లు వెళ్లే వ్యవస్థనూ పార్టీ ఏర్పాటు చేసిందని అన్నారు.
- Advertisement -