Tuesday, May 19, 2026

ఏకంగా సీఐ నే బ్లాక్ మెయిల్ చేసిన నకిలీ విలేకర్ల ముఠా

- Advertisement -

ఏకంగా సీఐ నే బ్లాక్ మెయిల్ చేసిన నకిలీ విలేకర్ల ముఠా

A gang of fake journalists blackmailed by the CIA

హైదరాబాద్

నల్గొండ జిల్లాలో నకిలీ విలేకర్ల ముఠా ఒకటి పోలీసులను టార్గెట్ చేసింది. అక్రమాలు బయటపెడతా అంటూ బెదిరింపులకు పాల్పడుతోంది. వీరి డిమాండ్లకు ఓ సీఐ తలొగ్గడం గమనార్హం. 5 లక్షలు ఇవ్వాలని సదరు ముఠా డిమాండ్ చేయగా, వారి ఆగడాలు తట్టుకోలేక సీఐ తన మిత్రుడి ద్వారా 1.10 లక్షలు ముట్ట జెప్పినట్లు తెలుస్తోంది. అయిన ఇప్పటికీ ఆ ముఠా బెదిరింపులు ఆగలేదు. తాము డిమాండ్ చేసిన సొమ్ములో మిగతా 4 లక్షలు ఇవ్వాలంటూ వేధించడం ప్రారంభించింది.
ఈ ముఠా ఆగడాలు భరించలేక సదరు సీఐ తన శాఖలోని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు దర్యాఫ్తు చేపట్టి ఆ ముఠాలోని ఒక నకిలీ విలేకరిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్