ఏపీ నిట్ లో ఘనంగా వాకథాన్ కార్యక్రమం
A grand walkathon program in AP NITతాడేపల్లిగూడెం, నవంబర్ 4.
ఆరోగ్యమే సమాజ అభివృద్ధికి మూలమని ఏపీ నిట్ డీన్ స్టూడెంట్స్ వెల్ఫేర్ డాక్టర్ జీబి వీరేష్ కుమార్ తెలిపారు. నిట్ రిజిస్ట్రార్ డాక్టర్ పి.దినేష్ శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రీయ ఏక్తా దివాస్ (జాతీయ ఐక్యతా దినోత్సవం)ను పురస్కరించుకుని ప్రాంగణంలో వాకథాన్ కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధి డాక్టర్ వీరేష్ కుమార్ మాట్లాడుతూ ఉక్కుమనిషి, భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని ఐక్యత దినోత్సవం గా జరుపుకుంటున్నామని, ప్రతి విద్యార్థి పటేల్ ఆశయ సాధనకు కృషి చేయాలని తెలిపారు. ఆరోగ్యవంతమైన సమాజం దేశాన్ని బలోపేతం చేస్తుందని చెప్పారు. ఐక్యతా నడక మన ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐక్య భారతదేశ దార్శనికతను బలోపేతం చేస్తుందన్నారు. ప్రతి విద్యార్థి దృడంగా, ఐక్యతగా ఉండడానికి ఈ వాకథాన్ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని వివరించారు. ముందుగా దేశ ఐక్యతను, సమగ్రతను కాపాడతామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. పరిపాలనా భవనం నుంచి నిట్ తూర్పు ముఖద్వారం వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో సాస్ అసిస్టెంట్లు, విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు




