Friday, February 7, 2025

90 గజాల స్థలం రూ.35 వేలు

- Advertisement -

90 గజాల స్థలం రూ.35 వేలు

A plot of 90 yards is Rs.35 thousand

కొత్త రకం మోసానికి దారులు
హైదరాబాద్,ఫిబ్రవరి 1, (వాయిస్ టుడే)
హైదరాబాద్‌లో భూముల ధరలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చదరపు గజం లక్షపైనే ఉంటుంది. మెయిన్ సిటీలో అయితే గజం 3-4 లక్షలకు పైగా ఉంటే.. నగర శివారు ప్రాంతాల్లోనూ గజం 50 వరకు ఉంటుంది. అలాంటింది హైదరాబాద్ నగరంలో తక్కువ ధరకే ప్లాట్లు. అది కూడా 90 గజాల స్థలం రూ.35 వేలు మాత్రమే. ఈ మాటలకు ఆకర్షితులైన చాలా వేల మంది ప్లాట్లు కొనుగోలు చేశారు. తక్కువ ధరకే ప్లాట్లు వస్తుండటంతో ఎగబడి కొన్నారు. తీరా అసలు విషయం తెలిసి ఖంగుతున్నారు.హైదరాబాద్- విజయవాడ హైవే మార్గంలోని ఆటోనగర్ హయత్ నగర్ మధ్య హరిణ వనస్థలి పార్కు ఉంది. కొన్ని వందల ఎకరాల్లో ఆ పార్కు విస్తరించి ఉంది. సమీప ప్రాంతంలో గజం రూ. 50 వేల నుంచి లక్ష వరకు పలుకుతోంది. ఆ పార్కుపై కన్నేసిన కొందరు కేటుగాళ్లు కబ్జా చేశారు. దాదాపు 582 ఎకరాల పార్కు స్థలాన్ని అక్రమంగా కబ్జా చేసి అమాయకులకు విక్రయించారు. హరిణ వనస్థలి పార్కున్న భూమి మెుత్తం ప్రైవేటు పట్టాభూమి అంటూ తప్పుడు పత్రాలు సృష్టించారు. 1336 ఫసలీ రికార్డుల ప్రకారం హైదరాబాద్‌ నగరానికి చెందిన హనీఫాబీ అనే మహిళను ఆ భూములకు కస్టోడియన్‌గా నమ్మించారు. ఈ భూముల్లో కొన్నింటిని ఫారెస్ట్ డిపార్ట్‌మెంటుకు లీజుకు ఇచ్చినట్లు చెప్పారు. అయితే ఫారెస్ట్ అధికారులు ఆ భూములు వెనక్కి ఇవ్వకుండా వారే కబ్జా చేశారంటూ నమ్మించారు. ఈపత్రాలను చాలా మంది అమాయకులకు చూపించి విక్రయించారు.హరిణ వనస్థలి పార్కులోనూ, పార్కు వెలుపల స్థలమంతా తమదేనంటూ మోసాలకు పాల్పడుతున్నారు. 90 గజాల స్థలం రూ.35 వేలకు విక్రయిస్తుండటంతో.. తక్కువ ధరకే ఖరీదైన ప్రాంతంలో స్థలం వస్తుందంటూ వేలమంది ప్లాట్లు కొనుగోలు చేశారు. ఈ రెండు, మూడేళ్ల కాలంలోనే సుమారు 50 వేల ప్లాట్లు విక్రయించినట్లు తెలిసింది. ఈ మేరకు రంగంలోకి దిగిన అధికారులు నిందితులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అడ్వొకేట్‌ జిలానీ, యూసఫ్‌ఖాన్‌ అనే వ్యక్తులను అరెస్టు చేశారు. కాగా, ప్లా్ట్లు కొనుగోలు చేసిన ప్రజలు లబోదిబోమంటున్నారు. తక్కువ ధరకే వస్తున్నాయని కదా అని రెండు, మూడు ప్లా్ట్లు కొన్నామని.. ఇప్పుడు తమ పరిస్థితి ఏంటని వాపోతున్నారు. అయితే మరీ ఇంత అమాయకత్వం, అత్యాశ పనికిరాదని.. లక్షలు విలువ చేసే స్థలాన్ని రూ.35 వేలకు విక్రయిస్తే ఎలా కొనుగోలు చేశారని ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్