Sunday, June 15, 2025

ఇద్దరు మహిళలను మోసం చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారి

- Advertisement -

ఇద్దరు మహిళలను మోసం చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అరెస్ట్

A real estate businessman who cheated two women

హైదరాబాద్, ఆగస్టు 1: మోసపోయేవాడు ఉంటే మోసం చేసేవాడికి కొదవేముంది. ఎన్నిరకాలుగా మోసం చేయాలో అన్ని రకాలుగా మోసం చేస్తూనే ఉంటారు కేటుగాళ్లు. ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కొందరు మోసగాళ్ల వలలో చిక్కుతుంటారు. భూములు, డబ్బులు, నగదు ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో రకాలుగా కేటుగాళ్లు మోసానికి పాల్పడుతుంటారు. ఇటు రియల్ ఎస్టేట్ రంగంలో అయితే మరింతగా మోసాలు జరుగుతూ ఉంటాయి. భూములు అమ్మకాలు, కొనగోళ్ల విషయంలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. తాజాగా హైదరాబాద్‌లో ఓ వ్యక్తి రియల్ ఎస్టేట్ పేరిట భారీ మోసానికి పాల్పడ్డాడు. చివరకు జైలు ఊచలులెక్కబెడుతున్నాడు.

భాగ్యనగరంలోని కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరిట మోసానికి నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షణ్ముఖ ఇన్ఫ్రా డెవలపర్స్ పేరిట గిద్దలూరి నాగేంద్ర ఆచారి (32) అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో వికారాబాద్‌ జిల్లాలోని నవాబ్ పేట మండల్ ఎల్లంకొండ గ్రామంలో సర్వే నెంబర్ 307 నుంచి 313 వరకు నిందితుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహించాడు. కేపీహెచ్‌బీ కాలనీలోని ఎంఐజి 88 లో ఆఫీస్ తెరిచి మోసానికి పాల్పడ్డాడు. బాలాజీ నగర్‌కు చెందిన అరిమంద సుజాత, వివేకానంద నగర్‌కు చెందిన పోచారెడ్డి సరితా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

A real estate businessman who cheated two women

గిద్దలూరి నాగేంద్ర ఆచారి చూపించిన రెండు ప్లాట్స్‌ను కొనేందుకు సుజాత సిద్ధమైంది. రూ.39 లక్షలకు బేరం కుదుర్చుకొని, అడ్వాన్స్ రూపంలో .23 లక్షల 95 వేల రూపాయలను వారికి అందజేసింది. మరో మహిళ సరిత 165 గజాల ప్లాట్‌ను తీసుకునేందుకుగాను రూ.16 లక్షల 50 వేలకు బేరం కుదుర్చుకొని 11 లక్షల 70 వేల రూపాయలను అడ్వాన్స్‌గా చెల్లించింది. అయితే వీరు కొన్న ప్లాట్‌ను తమ పైన రిజిస్ట్రేషన్ చేయాలని నిందితుడిపైన ఇద్దరు మహిళలు ఒత్తిడి తీసుకువచ్చారు. అయితే ఈ వ్యవహారాన్ని దాటవేస్తూ ఉండడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు ఇచ్చిన చెక్కులు కూడా బౌన్స్ అయ్యాయి. దీంతో మోసపోయామని గ్రహించిన ఇద్దరు మహిళలు… కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు నాగేంద్ర ఆచారిని అదుపులోకి తీసుకున్నారు..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్