Monday, March 30, 2026

ఆహార కల్తీని నియంత్రించడానికి రాష్ట్రంలో ఒక ప్రత్యేక వ్యవస్థ ముఖ్యమంత్రి   ఎ. రేవంత్ రెడ్డి  

- Advertisement -

ఆహార కల్తీని నియంత్రించడానికి రాష్ట్రంలో ఒక ప్రత్యేక వ్యవస్థ
ముఖ్యమంత్రి   ఎ. రేవంత్ రెడ్డి  
హైదరాబాద్

A Special System in the State to Curb Food Adulteration
Chief Minister A. Revanth Reddy
ఆహార కల్తీని నియంత్రించడానికి రాష్ట్రంలో ఒక ప్రత్యేక వ్యవస్థను తీసుకొస్తామని ముఖ్యమంత్రి   ఎ. రేవంత్ రెడ్డి  తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొత్తగా తీసుకొచ్చిన ఈగల్, హైడ్రా తరహాలోనే ఆహార కల్తీని నియంత్రించడానికి కూడా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకోసం దేశంలో ప్రస్తుతం అమలవుతున్న కల్తీ నిరోధక చట్టాలను అధ్యయనం చేసి పరిష్టమైన చర్యలు చేపడుతామని చెప్పారు.
రాష్ట్రంలో 3.39 కోట్ల మందికి పంపిణీ చేస్తున్న సన్నబియ్యం పథకం ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులకు శాసనసభ సెంట్రల్ హాలులో సన్నబియ్యంతో భోజనం ఏర్పాటు చేశారు.  ముఖ్యమంత్రి గారితో పాటు మండలి చైర్మన్  గుత్తా సుఖేందర్ రెడ్డి,  స్పీకర్  గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి  మల్లు భట్టి విక్రమార్క,  నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి  ఉత్తమ్ కుమార్ రెడ్డి తో పాటు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొని భోజనం చేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  మీడియాతో ముచ్చటిస్తూ.. “రేషన్ షాపుల ద్వారా దొడ్డుబియ్యం అందించినా తినేవారు లేకపోవడంతో ఆ బియ్యాన్ని సన్నబియ్యంగా మార్చే మాఫియా పెరిగిపోయింది. పైగా దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి ఖర్చు తప్ప పేదలకు ఉపయోగపడటం లేదు. అన్ని రకాలుగా ఆలోచనలు చేసిన తర్వాత పేదలు తినగలిగే సన్నబియ్యం అందించాలని ఈ పథకాన్ని ప్రారంభించాం.
ఇందుకోసమే క్వింటాలుకు 500 రూపాయల బోనస్ ప్రకటించి సన్నవడ్లు పండించాలని రైతులను ప్రోత్సహించాం. అడిగిన ప్రతి వారికి రేషన్ కార్డు జారీ చేశాం. ఇదే తరహాలో రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యమైన విద్య, పోషకాహారం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ క్రమంలో పంట మార్పిడి విధానాలపై రైతుల్లో అవగాహన కల్పిస్తాం. వాణిజ్య ఇతర పంటల వైపు రైతులను ప్రోత్సహిస్తాం..” అని ముఖ్యమంత్రి అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్