యువకుల వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య?
A young woman committed suicide because she could not stop the harassment of the youth?
నల్లగొండ జిల్లా :జులై 11
నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలం చింతలగూడెం గ్రామానికి చెందిన కొత్త రామలింగం రజిత దంపతులకు కుమారుడు, కుమార్తె కల్యాణి(18) ఉండగా..కల్యాణి పాలిటెక్నిక్ పూర్తి చేసి హైదరాబాద్ ప్రైవేట్ ఉద్యోగం చేసింది.
కొంతకాలంగా ఆమె ఇంటి వద్దే ఉంటోంది. ఒకే గ్రామానికి చెందిన ఆరూరి శివ, కొమ్మనబోయిన మధులు స్థానికంగా ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు. ఒకే ఊరు వారు కావడంతో ఆరూరి శివ, కొమ్మన బోయిన మధులతో కళ్యాణికి పరిచయం ఉంది.
అయితే శివ, కొమ్మనబోయి న మధులు కల్యాణిని ఇష్టపడుతున్నారు.వీరిద్దరూ కొద్దిరోజుల కిందట కల్యాణి ఫోన్ నెంబర్ ను తెలుసుకొని ఆమెకు తరచూ ఫోన్లు చేయడం ప్రారంభించారు. ఒకే ఊరు కావడంతో ఉన్న పరిచ యాన్ని ఆసరాగా చేసుకుని తనను ప్రేమించాలని శివ, తనను పెళ్లి చేసుకోవాలని మధులు యువతిని వేధింపులకు గురి చేశారు.
వీరిద్దరి ప్రేమ, పెళ్లి విష యాన్ని కళ్యాణి నిరాక రించింది. వారితో మాట్లా డడం కూడా బంద్ చేసింది. దీంతో శివ మధులిద్దరూ.. వాట్సాప్ లో ఆమె డీపీగా (డిస్ప్లే పిక్చర్) పెట్టుకున్న ఫొటోలను తీసుకుని వాటిని తమ వాట్సాప్, ఇన్స్టాగ్రా మ్లో.. స్టేటస్ గా పెట్టుకుం టామని బెదిరించారు.
చెప్పినట్లు వినాలంటూ పదే పదే టార్చర్ పెట్టడంతో ఇద్ద రు, యువకులు వేధింపులు తాళలేక కల్యాణీ ఈ నెల 6వ తేదీన ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేసుకుంది..
వెంటనే గమనించిన స్థాని కులు కుటుంబ సభ్యులు కళ్యాణి మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆ తర్వాత నల్లగొండలో ప్రైవే ట్ ఆస్పత్రికి తరలించారు.
ఈ క్రమంలో చికిత్స పొందు తున్న కళ్యాణి బుధవారం సాయంత్రం మృతి చెందిం ది. దీంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండె లవిసేలా రోదిస్తున్నారు.
తమ కుమార్తె మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని తల్లి రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ గ్రామస్తుల పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.
తన ఆత్మహత్యకు కారకులు శివ, మధులేనని కళ్యాణి జడ్జికి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొంది. కళ్యాణి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని, నింది తులు శివ, మధులు పరారీలో ఉన్నారని పోలీసులు చెబుతున్నారు.