డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన  యువతి… పోలీస్ లతో వాగ్వాదం

- Advertisement -

పోలీసులకు కనిపించిన చుక్కలు

A young woman found drunk and driving... had an argument with the police
A young woman found drunk and driving… had an argument with the police

హైదరాబాద్: సికింద్రాబాద్ బోయిన్ పల్లి లో మద్యం మత్తులో ఓ యువతి పోలీసులకు చుక్కాలు చుపించింది.. రెండు గంటల పాటు బోయిన్ పల్లి ప్రధాన రహాదారి పై హంగామా సృష్టించడంతో పోలీసులు చివరికి ఆమెను పోలీస్టేషన్ కు తరలించారు.. షాహెనాజ్ అనే ఈవెంట్ ఆర్గనైజర్ తన మిత్రులతో కలసి మద్యం సెవించి మద్యం మత్తులో వేగంగా కారును డ్రైవ్ చేసింది. జూబ్లిబస్ స్టేషన్ వద్ద వేగంగా ఇష్టం వచ్చినట్లు గా కారు నడపడం చూసి అనుమానం కలిగిన ట్రాఫిక్ పోలీసులు ఆ వాహానం ను రెండు కిలో మీటర్లు వెంబడించారు. డయిమండ్ పాయింట్ వద్ద ఆపేందుకు యత్నించిన కానిస్టేబుల్ ను డీ కోట్టి వెళ్ళిపోవడంతో చివరికి తాడ్ బండ్ సమీపంలో కారును ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారు. వాహానం ఆపిన పోలీసులను నానా బూతులు తిడుతూ హంగామా సృష్టించడంతో పాటు..అడ్డువచ్చిన కానిస్టేబుళ్ళను తోసేసే ప్రయత్నం చేశారు. చివరికి రెండు గంటల పాటు హాంగామా సృష్టించగా బోయిన్ పల్లి మార్గంలో వాహానాలు నిలిచిపోయాయి. స్థానికులంత నచ్చజేప్పగా చివరికి రంగంలోకి దిగిన పోలీసులు, ఆమె తో పాటు అతని మిత్రున్ని పోలీస్టేషన్ కు తరలించారు. బ్రిత్  ఎనలైజర్ ద్వారా తనిఖీ చేయగా ఎకంగా 427 రీడింగ్  రావడంతో ట్రాఫిక్ పోలీసులు  అవాక్కాయ్యారు. మొదటి సారి భారీ రీడింగ్ యువతి విషయంలో నమోదు కావడంతో ఇక న్యూసేన్స్ తో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసును బుక్ చేశారు పోలీసులు..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular