అనుమతులు లేని కాస్మోటిక్ క్లినిక్ లపై చర్యలు చేపట్టాలి
ఔషద నియంత్రణ శాఖ కు వినియోగదారుల మండలి ఫిర్యాదు
హైదరాబాద్ ఫిబ్రవరి 1 (
;రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో పుట్ట గొడుగుల్లా వెలుస్తున్న స్లిమ్మింగ్ మరియు కాస్మెటిక్ క్లినిక్ ల అక్రమ వ్యాపార విధానాల వల్ల అమాయకులైన ఆడపిల్లలు, మహిళలు ఆరోగ్య పరంగా అతి దారుణంగా మోసపోతున్నారని, ఆయా సెంటర్ల పై కఠిన చర్యలు చేపట్టాలని ఔషద నియంత్రణ శాఖ కు వినియోగదారుల మండలి డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం వినియోగదారుల మండలి రాష్ట్ర అధ్యక్షుడు సాంబరాజు చక్రపాణి హైదరాబాద్ లోని ఔషధ నియంత్రణ శాఖ జాయింట్ డైరెక్టర్ గుగలోతు రాంధన్ కు వినతి పత్రం సమర్పించారు. శంషాబాద్ లోని ఒక డిగ్రీ కళాశాల విద్యార్థిని ఫిర్యాదు మేరకు, బంజారాహిల్స్ ప్రాంతంలో ఉన్న ఒక కాస్మోటిక్ క్లినిక్ నిర్వాహకులు ఇచ్చిన అందమైన ప్రకటనల ప్రకారం, cool sculpting tecnology ద్వారా లావుగా ఉన్నటువంటి అమ్మాయిల శరీరంలో కొవ్వు శాతం తక్కువగా చేసి, అందంగా తయారు చేస్తామని, ఈ టెక్నాలజీ కి FDA అనుమతులు ఉన్నాయని ప్రకటించడం తో, కొద్దిగా లావుగా ఉన్న బాధితురాలు కాస్మెటిక్ క్లినిక్ ప్రకటనలను నమ్మి, మొదటగా రు 15,000/- తరువాత రు 70,000/- మొత్తం 85,000/- చెల్లించి, కాస్మోటిక్ క్లినిక్ లో చికిత్స ప్రారంభం లోనే, అతి పెద్ద ప్రమాదానికి గురైందని పేర్కొన్నారు.. పొట్ట పై భాగంలో ఉన్న కొవ్వు ను అతి శీతలంలో గడ్డ కట్టించి, తొలగించడానికి బదులు, నాసిరకమైన మెషినరీ వల్ల పొట్ట పైభాగంలో తీవ్ర మైన నొప్పి తో, పెద్ద పెద్ద బొబ్బలు రావడం, పొట్ట పైభాగం మొత్తం కూలిపోవడంతో, ప్రాణాపాయ స్థితిలో మరొక కార్పోరేట్ ఆసుపత్రిలో చేరి, చికిత్స పొందుతూ, ప్రాణాలను కాపాడు కొవడం జరిగిందన్నారు.. ఈ క్రమంలో బాధితురాలు వినియోగదారుల మండలి కి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సమాచారం ప్రకారం, హైదరాబాద్ రాజధాని పరిసరాలలో సరియైన అనుమతులు లేని కాస్మోటిక్స్ క్లినిక్ లు అనేకం చర్మవ్యాధి నిపుణులు, కాస్మెటిక్ సర్జన్ లు లేకుండా, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఆమోదం లేని మిషనరీ లతో, మోసపూరిత ప్రకటనలతో, మహిళలను ఆరోగ్యపరంగా నష్టానికి గురవుతున్నందున, నేడు సాంబరాజు చక్రపాణి ఔషధ నియంత్రణ శాఖ కు ఫిర్యాదు చేయడం జరిగిందని సాంబరాజు చక్రపాణి తెలిపారు.
అనుమతులు లేని కాస్మోటిక్ క్లినిక్ లపై చర్యలు చేపట్టాలి
- Advertisement -
- Advertisement -