వేసవి విద్యుత్ డిమండ్ కు ముందస్తు చర్యలు

- Advertisement -

వేసవి విద్యుత్ డిమండ్ కు ముందస్తు చర్యలు

Advance measures for summer electricity demand

హన్మకొండ
రాబోవు వేసవి కాలానికి విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా   అన్ని రకాల  ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని హన్మకొండ సూపెరింటెండింగ్ ఇంజనీర్  కె.వెంకట రమణ తెలిపారు.  ఇందులో భాగంగా నేడు హనుమకొండలోని  న్యూ శాయంపేట సబ్ స్టేషన్ లో 5 యంవియే పవర్ ట్రాన్స్ఫార్మర్ నుండి 8 యంవీయే పవర్ ట్రాన్స్ఫార్మర్ కు పెంచామని అన్నారు . ఇది వరకు 8  యంవీయే పవర్ ట్రాన్స్ఫార్మర్ తో పాటు ఇది అదనంగా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు . దింతో మొత్తం 16 యంవియే పవర్ ట్రాన్స్ఫార్మర్ ల సామర్ధ్యం పెరిగిందని చెప్పారు .  ఈ  పవర్ ట్రాన్స్ఫార్మర్  పెంచడం వలన వేసవిలో  లోడ్  ఎంత పెరిగిన ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని స్పష్టం చేశారు .  వినియోగదారులకు మెరుగైన , నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించే లక్ష్యంగా  తీసువల్సిన  అన్ని చర్యలు తీసుకుంటున్నామని  ఈ సందర్భంగా వివరించారు.  ఈ కార్యక్రమంలో  హన్మకొండ టౌన్  డిఈ జి . సాంబరెడ్డి, ఏడిఈ పి. మల్లికార్జున్, జానకి రాంరెడ్డి,  దర్శన్ కుమార్ , ఏఈ అరుణ్ కుమార్ తదితరులు  పాల్గోన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular