Thursday, May 21, 2026

హైదరాబాద్ లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్

- Advertisement -

హైదరాబాద్ లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్

AI data center cluster in Hyderabad

తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న కంట్రోల్ ఎస్ (CtrlS)

రూ.10 వేల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూపై సంతకాలు

తెలంగాణలో అత్యాధునిక AI డేటాసెంటర్ క్లస్టర్‌ను నెలకొల్పేందుకు కంట్రోల్ ఎస్ డేటా సెంటర్స్ లిమిటెడ్ కంపెనీ అవగాహన ఒప్పందం (ఎంవోయూ)పై సంతకం చేసింది.

దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు  సందర్భంగా ఈ ఒప్పందం కుదిరింది.

అర్టిఫిషియల్ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు ఈ కంపెనీ   రూ. 10,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. 400 మెగా వాట్ల సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ నెలకొల్పుతుంది.

ఈ ప్రాజెక్ట్ దాదాపు 3,600 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి.

ఈ సమావేశం అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్దిలో ఈ డేటా సెంటర్ ఏర్పాటు మరో మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. ఐటీ సేవల సామర్థ్యం పెరుగుఉందని, ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని అన్నారు.

డేటా సెంటర్ల ఏర్పాటు తెలంగాణలో ఐటీ సేవల ప్రమాణాలు మరింత వృద్ది సాధిస్తాయని కంట్రోల్ ఎస్ సీఈవో శ్రీధర్ పిన్నపురెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకోవటం గర్వంగా ఉందన్నారు.  సంతోషం వ్యక్తం చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్