ఆనందోత్సవాన్ని నింపిన అల్ఫోర్స్ ఎక్సెల్
కరీంనగర్,
Alfors Excel filled the celebration
వినోదబరితమైన కార్యక్రమాలతో చాలా ఆనందం కల్గడమే కాకుండా వివిధ కార్యక్రమాలను చేపట్టడం ద్వారా వస్తున్న ఒత్తిడిని జయించవచ్చని, చక్కటి వాతావరణాన్ని ఏర్పాటు చేయవచ్చని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్ లోని ఒక ప్రవేట్ వేడుక మందిరంలో ఆకాశమే హద్దుగా ఎక్సెల్ పేరుతో వైభవంగా కళాశాల ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. చదువుల తల్లి సరస్వతి మాత విగ్రహానికి పూల మాల వేసి సాంప్రదాయబద్దంగా జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను నరేందర్ రెడ్డి అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ నేడు చాలా మంది యువకులు తీవ్ర ఒత్తిడికి గురవడం చాలా విచారకరమని ఆందోళన వ్యక్తం చేశారు. చక్కటి ప్రణాళికలతో కార్యక్రమాలతో రూపొందించి లక్ష్యాలను చేరుకోవాలని చెప్పారు. తల్లిదండ్రులు వారి పిల్లిలకు కావల్సిన వనరులను సమకూర్చి వారిని అగ్రశ్రేణిలో నిలుపేందుకు ప్రోత్సాహం అందించి సాధించే దిశగా పయనించాలని సూచించారు. మన దేశం నుండి రాష్ట్ర ప్రతినిధులు అభివృద్ధి ప్రణాళికలను రూపొందిస్తు విద్యార్థులను ఎల్లపుడు ప్రోత్సహిస్తూ వారికి ఉపాధి అవకాశాలను మెరుగు పరుస్తున్నారని చెప్పారు. వివిధ పనులకు ఆకర్షితులై ఉజ్వల భవితన్ను వృదా చేసుకోవద్దని చెప్పారు. చిన్ననాటి నుండే ఉత్తమంగా వ్యవహరించి సమాజానికి ప్రతీకగా ఉండాలని చెప్పారు.విద్యార్థులు సంచలన విజయాలను నమోదు చేయడం చాలా అభినందనీయమని మరియు మొదటి నుండే ఉత్తమంగా వ్యవహరిస్తు చాలా చక్కటి పేరు ప్రఖ్యాతలను స్వంతం చేసుకోవడం వారి వ్యవహరా శైలికి ఒక గొప్ప నిదర్శనమని అభివర్ణించారు. గత 35 సం||లుగా అల్ఫోర్స్ విద్యాసంస్థలు స్పూర్తిదాయకంగా ఎటువంటి ఆటంకం లేకుండా కృషి చేస్తున్నదని, విద్యాభివృద్ధికై నూతన ఒరవడిని సృష్టిస్తు సమాజంలో వెలుబడుతున్న మార్పులకు అనుగుణంగా ప్రవేశపెడుతున్న మార్పులను దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగడమే కాకుండా సంచలనాత్మక విజయాలను నమోదు చేస్తు నూతన అధ్యాయాలకు భీజం పోస్తున్నదని హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులను అన్ని రకాలుగా అభివృద్ధి పరచడమే ప్రధాన లక్ష్యమని చెప్పారు.
వేడుకలలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించినటువంటి ఓ మై ఫ్రెండ్, జయ్ సియరామ్ జయ్ జయ్ సియరామ్, గువ్వాగోరింకతో, చలియా చలియా… నృత్యాలు చాలా అలరించాయి.వివిధ ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో సీట్లు పొందిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ముఖ్యంగా తల్లిదండ్రుల ఆశయాలను ఎప్పటికప్పుడు సాధిస్తు వారి దృష్టిలో అత్యుత్తమ పిల్లలుగా ఖ్యాతి ఘడించి చక్కటి స్థానంలో ఉండాలని అభిలాషించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్, అధ్యాపకలు, తల్లిదండ్రులు,విద్యార్థులు పాల్గొన్నారు.