Wednesday, September 18, 2024

అమరావతిని నాశనం చేశారు.. పోలవరాన్ని గోదావరిలో కలిపేశారు

- Advertisement -

రావుల పాలెంలో చంద్రబాబు

రాజమండ్రి, ఆగస్టు 18: నాలుగేళ్ల కాలంలో రాష్ట్రానికి ఏం చేశావ్‌..  తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వస్తుంది.. మళ్లీ సంక్షేమ కార్యక్రమాలు పడతాం అన్నారు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఈ స్టిక్కర్‌ ముఖ్యమంత్రిని నమ్మవద్దని పిలుపునిచ్చారు. ఆరునెలల్లో ఇంటికి పోతారని.. ఎక్సైరీ డేట్‌ దగ్గర పడిందని.. ఈ పనిచేశానని చెప్పుకునే దమ్ము ఉందా అంటూ జగన్మోహన్‌రెడ్డిపై విరుచుకుపడ్డారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. కొన్ని వందల పనులు చేశాం కాబట్టి తాము చెప్పుకోగలుగుతున్నామని అన్నారు. అమరావతి నాశనం చేశారు.. పోలవరాన్ని గోదావరిలో కలిపేశారు.. పరిశ్రమలను తరిమేశారు.. రిషికొండను గుండు చేశారు. విశాఖపట్నంలో ఎర్రదిబ్బలు అమ్మేశారు. పోలవరం డయాఫ్రమ్‌వాల్‌ కానీ, గైడ్‌బండ్‌కానీ. కాపర్‌ డ్యామ్‌ కానీ మూడు అడ్రస్‌ లేకుండా తీసుకొచ్చారు. పోలవరం చాలా సున్నితమైన ప్రాజెక్టు… 50 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుంది.. అన్ని నీళ్లు జిల్లా మీదకు వస్తే ఏమవుతుందని ప్రశ్నించారు. మాట్లాడితే నా ఎస్సీలు, నా బీసీలు అంటారు.. మీ బిడ్డను అంటాడు.. బిడ్డ కాదు క్యాన్సర్‌ గడ్డ అన్నారు.. క్యాన్సర్‌ వస్తే ఎంత ప్రమాదమో రాష్ట్రానికి జగన్‌ అనే క్యాన్సర్‌ గడ్డ ప్రమాదమని, దీన్ని తొలగించుకోవాలన్నారు. మతిస్థిమితం లేని సైకో.. పిచ్చివాని దగ్గర రాయి.. ఇలాంటి వాడ్ని వదిలించుకోవాలా వద్దా అన్నారు..

amaravati-was-destroyed-polavaram-was-merged-into-godavari
amaravati-was-destroyed-polavaram-was-merged-into-godavari

ఎంత తొందరగా ఇంటికి పంపిస్తే అంత మంచిది అన్నారు చంద్రబాబు. చిర్ల కాదు.. చిల్లర జగ్గిరెడ్డి.. నీ అవినీతి గుట్టను చూశాను.. ఖబర్దార్‌ జాగ్రత్తగా ఉండు.. అంటూ కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డిపై విరుచుకపడ్డారు చంద్రబాబు.  సైకో ముఖ్యమంత్రిని అడుగుతున్నా.. ఈ ప్రజల సంపద, సహజవనరు దోచేయాలని చూస్తున్నావు ప్రజాకోర్టులో నిన్ను బోను ఎక్కించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. జే ట్యాక్స్‌ పేరుతో జగన్‌రెడ్డి, జగ్గిరెడ్డి వసూళ్లు చేస్తున్నారన్నారు. ఎందెందు కలదని అన్నిటినా అవినీతి కంపు అన్నారు. విలువైన భూముల్లో వివాదాలు సృష్టించడం, సెటిల్‌మెంట్‌ చేయడం ఇదే పనికి జగ్గిరెడ్డిది. చిర్ల జగ్గిరెడ్డి నాలుగేళ్లలో వసూళ్ల రెడ్డిగా మారిపోయారు.. కొత్తపేటలో చిల్లర జగ్గిరెడ్డి తప్ప ఎవ్వరూ ఆనందంగాలేరన్నారు. గోపాలపురం దళితులు ఎమ్మెల్యే స్వగ్రామం.. భారత రత్న అంబేడ్కర్‌ ఫోటోను టిఫిన్‌ ప్లేట్లలో పెట్టి సర్వ్‌చేసే పరిస్థితికి వచ్చారు. దీనిని ప్రశ్నించిన యువకులపై దేశద్రోహం కేసు పెట్టారంటే ఈ జగ్గిరెడ్డిని ఏమనాలని అన్నారు చంద్రబాబు. ఇక్కడ జగ్గిరెడ్డి మద్యం వస్తూ ఉంది.. అదికూడా కాదనుకుంటే గంజాయి కూడా వస్తుంది.. గంజాయి మత్తులో ఉన్నవారికి మంచి చెడులు తెలియదు.. ఈ ముఖ్యమంత్రి ఒక్కరోజైనా సమీక్ష చేశారా.. మాట్లాడితే బటన్‌ నొక్కానంటారు అని మండిపడ్డారు.

amaravati-was-destroyed-polavaram-was-merged-into-godavari
amaravati-was-destroyed-polavaram-was-merged-into-godavari

రావులపాలెంలో గంజాయి ఉందా లేదా.. ముఖ్యమంత్రీ సమాధానం చెప్పు అని నిలదీశారు చంద్రబాబు. పిల్లలు అంటే లెక్కలేదా బాధ్యతలేని ముఖ్యమంత్రి వల్ల గంజాయి పంట వాణిజ్య పంటగా మారిందన్నారు. ముఖ్యమంత్రి పదవిపై నాకు ఆశలేదు.. నా బాధ, నా ఆవేదన కేవలం రాష్ట్ర భవిష్యత్తుపైనే అన్నారు చంద్రబాబు. రావులపాలెం పక్కనే జన్నాడ దగ్గర పెద్ద గుట్టల్లా ఇసుకను పేర్చారు.. ఎవడ్రా ఈ మహానుభావుడు అనుకున్నా.. నేరుగా వెళ్లాను అక్కడికి తాడి నాగమోహన్‌రెడ్డి అంట.. చిల్లర జగ్గారెడ్డి మనిషి.. ఇతను బినామీనా అవునా కాదా అని ప్రశ్నించారు.. రోజుకు నాలుగు వందల లారీలు వెళ్తున్నాయి.. ఇక్కడ లోడ్‌ చేసి విశాఖపట్నం వెళ్లడమే నీ పని అని డ్రైవర్‌తో చెప్పారని చెప్పాడు. రోజుకు పదివేల టన్నుల ఇసుక జన్నాడ నుంచి తరలిపోతుంది.. నేనున్నప్పుడు ఇసుక ఉచితంగా ఇచ్చానా లేదా అని ప్రశ్నించారు. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు దగా పడ్డారన్నారు. ఒక మంత్రి ఎనిమిది వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు తీసుకున్నారు.. అతని కొడుకు ఇక్కడ ఇంచార్జి కూడా.. ఈరాష్ట్రం కోసం తిరుగుబాటు చేయండి అని చంద్రబాబు పిలుపునిచ్చారు. కేసులు పెడతారని భయపడితే జగ్గారెడ్డి ఎంగిలి మెతుకుల కోసం ఎదురు చూడాలి అన్నారు. ఇంకో ఎమ్మెల్సీ డ్రైవర్‌ను చంపి డోర్‌ డెలివరీ చేశారు.

రాజమండ్రి నుంచి ఊరేగింపుగా తీసుకెళ్లారు.. దళిత ద్రోహులు కాదా అని ప్రశ్నించారు. 27 పథకాలు తీసేశారని, చాలా ద్రోహం చేశారన్నారు. రైతులకు అన్నదాత కింద 20 వేలు ఇచ్చే బాధ్యత తనది అన్నారు.కరెంట్  ఛార్జీలు పెంచానా అని ప్రజలను ప్రశ్నించారు. కరెంటు రాదు.. కానీ ఛార్జీలు పెంచారని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. భవిష్యత్తు ఇంధనం, సోలార్‌ ఎనర్జీ అవరమైతే కరెంట్‌ ఛార్జీలు తగ్గించే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉందన్నారు. కరెంట్‌ ఛార్జీలు తగ్గితే పెట్టుబడులు పరుగెడుతూ వస్తాయి.. ఆర్టీసీ రేట్లు, ఇంటిపన్ను, వృత్తిపన్ను ఎలా పెంచారు.. నాసీరంకం బ్రాందీ అమ్ముతూ ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారని ఆరోపించారు. అందరికీ అమ్మఒడి లేదు.. అనేక ఆంక్షలు పెట్టారు.. సంక్షేమం అంటారు.. అరకొరగా ఇస్తారు.. నేను ఒకేసారి 2000 పింఛన్ పెంచాను.. వృద్ధులు అయిదేళ్లల్లో 30,000 నష్టపోయారు అని గుర్తు చేశారు చంద్రబాబు. భవిష్యత్తులో సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఆదాయాన్ని సృష్టించి ఆ సంపద పేద ప్రజలకు పంచే పార్టీ. ప్రజలకు హామీ ఇస్తున్నాను. భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తున్నాను.. నేను వేసిన ఫౌండేషన్‌ వల్ల హైదరబాద్‌లో ఐటీలో అభివృద్ధి చెందింది.. 2029 మిషన్‌ తయారు చేశాను అన్నారు చంద్రబాబు.జగన్‌రెడ్డి.. సమాజాన్ని భయపెట్టారు. బాబాయ్‌ను చంపి ఒకప్పుడు ముద్దులు పెట్టారు.. ఇప్పుడు గుద్దులే గుద్దులే అన్నారు. నోరు విప్పితే ఏమీ లేదంటారు… మీడియా లేదంటారు.. ప్రతీ రోజూ మనకు వ్యతిరేకంగా రాయడం, బటన్‌ నొక్కడం ప్రచారం చేసుకోవడం.. ఆయన పొట్టే అబద్దాల పుట్ట అన్నారు..స్వాతంత్య్రదినోత్స ప్రసంగంలో పేదలకు, పెత్తందార్లకు పోరాటం అంట.. పేదవాళ్లకు గోచీ లేకుండా చేస్తున్నారు.. జగన్మోహన్‌ రెడ్డి సమాధానం చెప్పు.. కేసులు పెట్టడం కాదు.. వాస్తవాలు రాస్తున్నారని, ఎవ్వరూ కంప్లైంట్‌ చేయకపోయినా మార్గదర్శిపై దాడులు చేస్తున్నారని ఆన్నారు. తల్లిని చూడలేని వ్యక్తి చెల్లికి తండ్రి ఆస్తిలో వాటా ఇవ్వలేని వ్యక్తి, చిన్నాన్నను గొడ్డలితో మట్టుపెట్టిన వ్యక్తి మిమ్మల్ని కాపాడుతారా..దేశంలోనే ధనికుడైన ముఖ్యమంత్రి పేదలను కాపాడతారా.. వాళ్ల గోచీ కూడా లాగేస్తున్నారు అని ఆరోపించారు చంద్రబాబు. ఆడబిడ్డల కోసం మహాశక్తి కార్యక్రమం తీసుకొస్తున్నామన్నారు. ఎటువంటి కండీషన్‌ లేకుండా 15 వేల రూపాయలు ఇచ్చే బాద్యత నాది.. ప్రతీ మహిళను శక్తివంతులుగా చేస్తాను..  నా తల్లి, చెల్లెల్లు ఇబ్బందులు పడకూడదని, దీపం పథకంతో వంట గ్యాస్‌ ఇచ్చాం..

amaravati-was-destroyed-polavaram-was-merged-into-godavari
amaravati-was-destroyed-polavaram-was-merged-into-godavari

ప్రతీ ఒక్కరికి సంవత్సరానికి మూడు సిలెండర్లు ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నాం.. ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని ఇస్తాం.. నిరుద్యోగ భృతి 3000 ఇస్తా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తా అన్నారు.. పెట్టుబడులు తీసుకొస్తానన్నారు.. బంగారు భవిష్యత్తు తీసుకొచ్చే బాద్యత నాది అన్నారు. నాసైన్యం యువత అన్నారు. ప్రపంచాన్ని జయించే ఆర్దీక వ్యవస్థలో భాగస్వాములను చేస్తానన్నారు. స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ నేర్పిస్తానన్నారు. ప్రపంచంలో అతి శక్తివంతమైన యువతను తయారు చేసే బాద్యత నాది అన్నారు. రాబోయే రోజుల్లో పిల్లలే తన సైన్యం అన్నారు. తెలుగు జాతిని ప్రపంచంలోనే శక్తి వంతులగా తీర్చిదిద్దే  బాద్యత నాది అన్నారు. అనంతరంపురంలో కరువు జిల్లా.. అటువంటి ప్రాంతంలో ఆరునెలల్లో రిజర్వాయరు కట్టి కియా మోటార్స్‌ను తీసుకొచ్చిన సత్తా తెలుగుదేశం పార్టీది.. అయిదేళ్లలో ఆరు లక్షల కోట్లపెట్టుబడులు తెచ్చాం.. అయిదు లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారు.. దుర్మార్గుడు వచ్చి మొత్తం నాశనం చేశాడు..వ్యవస్థను బ్రస్టు పట్టించారు.. కొబ్బరి, వరి పండిరచే రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. మళ్లా రైతును రాజుగా చేసే బాద్యత నాది అన్నారు. రైతులకు సబ్సిడీ ఇచ్చి కాపాడుకుంటానన్నారు. బీసీలకు రక్షణ చట్టాన్ని తీసుకువస్తామన్నారు. తెలుగుదేశం పార్టీకు వెన్నుముక బీసీలు.. బీసీలకోసం ప్రత్యేక పాలసీను తీసుకువస్తామన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్