ఖరారైన  అమిత్‌ షా తెలంగాణ పర్యటన

- Advertisement -
Amit Shah's visit to Telangana is final
Amit Shah’s visit to Telangana is final

హైదరాబాద్‌:ఆగస్టు 14: తెలంగాణలో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తున్న బీజేపీ ఇందుకు అనుగుణంగా రాష్ట్రంలో ఆ పార్టీ అగ్రనేతలు పర్యటించేలా ప్లాన్‌ చేసింది. తాజాగా బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తెలంగాణ పర్యటన ఖరారైంది.

ఈ నెల 27న అమిత్‌ షా తెలంగాణలో పర్యటించనున్నారు. అదే రోజున ఖమ్మంలో భారీ సభ నిర్వహించేందుకు బీజేపీ ప్లాన్‌ చేస్తోంది.

ఇప్పటికే అమిత్‌ షా పర్యటన రాష్ట్రంలో రెండు సార్లు వాయిదా పడింది. బిపర్‌జాయ్‌ తుఫాన్‌ కారణంగా ఒకసారి, మణిపూర్‌ అల్లర్లు, వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో మరోసారి అమిత్‌ షా తెలంగాణ పర్యటన రద్దయింది.

అసెంబ్లి ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో తెలంగాణలో పర్యటించాలని బీజేపీ రాష్ట్ర నేతలు అమిత్‌షాకు పదే పదే విన్నవించారు. అసెంబ్లి ఎన్నికలకు ఇక నాలుగు నెలల సమయమే ఉండడంతో అమిత్‌ షా రాష్ట్ర పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది…

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular