- Advertisement -
వివాహేతర సంబంధం ముగ్గురి ప్రాణాలు తీసింది
An extra-marital affair killed three lives
ఎస్సై సహా మహిళా కానిస్టేబుల్.. మరోకరి ఆత్మహత్య..?
కామారెడ్డి
కామారెడ్డిలో సంచలనం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం ముగ్గురి ప్రాణాలు తీసింది. కామారెడ్డి జిల్లా అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువులో భిక్కనూరు ఎస్సై సాయి కుమార్ శవం లభ్యమైంది. బుధవారం అర్థరాత్రి దాటిన తరువాత కానిస్టేబుల్ శృతి, మరో యువకుడు నిఖిల్ శవం లభ్యమైన విషయం తెలిసిందే. తాజాగా అదృశ్యమైన ఎస్సై మృతదేహం కూడా దొరికింది. కానిస్టేబుల్ శృతితో వివాహేతర సంబంధంతోనే ఆత్మహత్యలు జరిగినట్లు పోలీసులు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు.
కామారెడ్డి జిల్లా బీబీపేట్ ఎస్సైగా సాయి కుమార్ విధులు నిర్వర్తిస్తున్న సమయంలో అదే పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్ గా పని చేస్తున్న శృతికి వివాహేతర సంబంధం ఏర్పడినట్లు సమాచారం. అప్పటికే ఎస్సైకి పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉండగా.. అప్పటికే శృతికి పెళ్ళై విడాకులు అయినట్లు తెలుస్తోంది: మిస్టర్ డెత్ పై ఎస్పీ సింధు శర్మ స్పందించారు ఎస్సై మొబైల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా మిస్ అయిన ఎస్సై, మహిళ కానిస్టేబుల్ లొ్కేషన్ గుర్తించ౩౩౩౩౩ విచారణ కొనసాగుతుందని పోస్టుమార్టం నివేదిక వచ్చేవరకు ఆత్మహత్యకు గల కారణాలు చెప్పలేమన్నారు.
- Advertisement -