అనిల్ కు ప్రాధాన్యం
సొంత సామాజికవర్గం దూరం…
నెల్లూరు, జూలై 56,
వైసీపీలో కులాల కుంపట్లు బయటపడ్డాయా? ఓటమికి కారణం మీరంటే మీరు అని నేతలు కయ్యానికి దిగుతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో వైసిపి పతనానికి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కారణమని రెడ్డి సామాజిక వర్గం ఆరోపణలు చేయడం విశేషం. అనిల్ తీరుతోనే ఎన్నికలకు ముందు రెడ్డి సామాజిక వర్గం నేతలంతా టిడిపిలో చేరిపోయారని ప్రచారం సాగుతోంది. ఇప్పుడు ఓటమితో స్వయంగా వైసీపీలోని రెడ్డి సామాజిక వర్గం అనిల్ తీరుపై రుస రుసలాడుతోంది. ఆయనకు ఇప్పటికీ జగన్ ప్రాధాన్యత ఇవ్వడాన్ని తప్పుపడుతోంది రెడ్డి సామాజిక వర్గం. నిన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జగన్ పరామర్శించిన క్రమంలో.. వైసీపీ శ్రేణుల మధ్య చిన్నపాటి వాదన రేగినట్లు సమాచారం.వైసిపి ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్న జిల్లాల్లో నెల్లూరు ఒకటి. 2014లో ఏకపక్ష విజయం అందించింది ఆ జిల్లా. 2019లో అయితే క్లీన్ స్వీప్ చేసింది. కానీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి సీన్ మారింది. టిడిపి కూటమి వైట్ వాష్ చేసింది. అయితే ఇంతటి భారీ ఓటమికి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2019లో అధికారం చేపట్టిన జగన్ తన మంత్రివర్గంలోకి అనిల్ కుమార్ యాదవ్ ను తీసుకున్నారు. దీంతో ఆయన స్థానిక రెడ్డి సామాజిక వర్గాన్ని పట్టించుకోలేదు. జగన్ ను గౌరవిస్తూ నెల్లూరు జిల్లాలో పెద్ద రెడ్లను దారుణంగా అవమానించారు. దీంతో ఎన్నికలకు ముందే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పార్టీకి దూరమయ్యారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నెల్లూరు పార్లమెంట్ స్థానం అభ్యర్థి వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన భార్య ప్రశాంతి రెడ్డిని అనిల్ టార్గెట్ చేసుకున్నారు. కానీ జగన్ నుంచి వారికి స్వాంతన లభించలేదు. తిరిగి అనిల్ కు మద్దతు తెలిపారు జగన్. అందుకే ఆ దంపతులు పార్టీకి దూరమయ్యారు. వైసీపీ క్యాడర్ను తీసుకెళ్లి టిడిపిలో చేరిపోయారు. నెల్లూరు జిల్లాలో వైసీపీకి ఈ గడ్డు పరిస్థితికి కారణమయ్యారు.వైసీపీకి మూలస్తంభంలా నిలబడ్డారు వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి. అటువంటి వేంరెడ్డిపై చాలా సందర్భాల్లో అనిల్ కుమార్ యాదవ్ విరుచుకుపడినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య ప్రశాంతి రెడ్డిని రాజమాతగా తులనాడుతూ అనిల్ చేసిన వ్యాఖ్యలు విపరీతంగా ప్రభావం చూపాయి. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం అనిల్ తీరును వ్యతిరేకించడం ప్రారంభించింది. అయితే జగన్ అనిల్ కు వెన్నుతట్టి ప్రోత్సహించడంతో ఆ ప్రభావం వైసీపీ పై పడింది. వైసీపీని సైతం రెడ్డి సామాజిక వర్గం వ్యతిరేకించడం ప్రారంభించింది. అదే నెల్లూరు జిల్లాలో టిడిపి కూటమి గెలుపునకు కారణమైంది. నిన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరామర్శకు జగన్ వచ్చిన తరుణంలో.. పార్టీ శ్రేణుల మధ్య ఇదే హాట్ టాపిక్ గా మారినట్లు తెలుస్తోంది.
అనిల్ కు ప్రాధాన్యం…సొంత సామాజికవర్గం దూరం
- Advertisement -
- Advertisement -