Monday, March 30, 2026

 నక్సల్స్ రహిత రాష్ట్రంగా ఏపీ

- Advertisement -

 నక్సల్స్ రహిత రాష్ట్రంగా ఏపీ
విజయవాడ, మార్చి 30

AP: A Naxal-Free State
మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు చెల్లూరి నారాయణ రావు సహా తొమ్మిది మంది ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఎదుట లొంగిపోయారు. వీరి లొంగుబాటుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నక్సల్స్ రహిత రాష్ట్రంగా మారిందని డీజీపీ ప్రకటించింది. లొంగిపోయిన మావోయిస్టుల నుంచి భారీగా ఆయుధ డంప్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.మావోయిస్టు పార్టీలో అత్యంత కీలక నేత, ఏవోబీ ) స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి చెల్లూరి నారాయణరావు అలియాస్ సోమన్న పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆయనతో పాటు పలువురు డివిజినల్, ఏరియా కమిటీ సభ్యులు కూడా జనజీవన స్రవంతిలో కలిసినట్లు డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా వెల్లడించారు. ఈ సందర్భంగా వారి నుంచి భారీ ఆయుధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు మారుమూల గ్రామాలకు కూడా చేరుతుండటం, ప్రస్తుతం పరిస్థితుల్లో చాలా మార్పు రావడంతో ఉద్యమ ఉనికి తగ్గుతోందని, అందుకే సాయుధ పోరాటాన్ని వీడి లొంగిపోయినట్లు సోమన్న వివరించారు.శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలానికి చెందిన నారాయణరావు దాదాపు 35 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్నాడు. 1989లో పీపుల్స్ వార్ గ్రూప్‌లో చేరిన ఆయన, క్రమంగా పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ మిలిటరీ ఆపరేషన్లలో ఆరితేరిన నేతగా గుర్తింపు పొందాడు. గత ఏడాది అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కీలక నేతలు గాజర్ల రవి, అరుణ మరణించిన తర్వాత, ఏవోబీ బాధ్యతల్ని సోమన్న చేపట్టారు. ఆయనపై ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఒడిశాలో పలు కేసులు నమోదయ్యాయి. ఏపీ ప్రభుత్వం భారీ రివార్డును కూడా ప్రకటించింది.ఉద్దానం ప్రాంతం నుంచి వచ్చిన సోమన్న లొంగుబాటుతో మావోయిస్టు పార్టీకి పెద్ద దిక్కు కోల్పోయినట్లయింది. గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు పరిస్థితులు మారాయని, ప్రజల్లోకి ప్రభుత్వ పథకాలు వెళ్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. సాయుధ పోరాటం ద్వారా సాధించేదేమీ లేదని గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ లొంగుబాటు ఏవోబీ ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలకు గట్టి విఘాతంగా మారుతుందని భద్రతా దళాలు భావిస్తున్నాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్