- Advertisement -
ఢిల్లీ ముఖ్యమంత్రి(Delhi CM), ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ ( Kejriwal)ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో ఆయన నివాసంలో సోదాలు నిర్వహించిన తర్వాత అదుపులోకి తీసుకున్నారు. ఆయన సెల్ ఫోన్ సీజ్ చేశారు. అయితే ఈడీ ఆఫీసుకు వెళ్లడానికి కేజ్రీవాల్ ముందు నిరాకరించడంతో అధికారులు ఆయన్ని బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ , సోదాల నేపధ్యంలో సీఎం కేజ్రీవాల్ ఇంటి దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
- Advertisement -