భారతీయ న్యాయ సంహిత మహిళా సాధికారత లపై అవగాహన
కోరుట్ల,
మహిళా సాధికారత కేంద్రం జగిత్యాల వారు నిర్వహిస్తున్న మహిళ సాధికారత భారతీయ న్యాయ సంహిత (నూతన చట్టం) పై 100 రోజుల ప్రత్యేక అవగాహన కార్యక్రమం జగిత్యాల జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న సందర్భంగా శుక్రవారం పట్టణంలోని స్థానిక రామకృష్ణ జూనియర్ కళాశాలలో విద్యార్థిని విద్యార్థులకు మహిళా సాధికారిక (ఉమేన్ ఎం పవర్ మెంట్)
నూతన చట్టం భారతీయ న్యాయ సంహిత- 2023 లో పొందుపరచిన మహిళలు, ఆడపిల్లలపై జరుగుతున్న హింసపై మహిళా హక్కులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.. ఈ సందర్భంగా కె. అశ్విని మహిళా సాధికారిక కేంద్రం జగిత్యాల జిల్లా కోఆర్డినేటర్ మాట్లాడుతూ మహిళా శిశు సంక్షేమ శాఖ మహిళలకు, శిశువులకు అందించే సేవల గురించి వివరించారు. అనంతరం లావణ్య సఖి జిల్లా న్యాయ కౌన్సిలర్ మాట్లాడుతూ మహిళల హక్కులు సాధించుకునే విధానం గురించి తెలిపారు.. కోరుట్ల సీనియర్ న్యాయవాది కటుకం రాజేంద్ర ప్రసాద్ నూతన చట్టం భారతీయ న్యాయ సంహిత -2023 గురించి అవగాహన కల్పించారు..
ఈ కార్యక్రమంలో మహిళా సాధికారిక కేంద్రం జగిత్యాల జిల్లా కోఆర్డినేటర్ అశ్విని, సఖి జిల్లా న్యాయ కౌన్సిలర్ లావణ్య, సీనియర్ న్యాయవాది కటుకం రాజేంద్రప్రసాద్, స్వప్న గౌతమి, మహిళా సాధికారిక కేంద్రం సభ్యులు, కళాశాల ప్రిన్సిపాల్ చక్కినాల రాజు, అధ్యాపక బృందం విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు..
భారతీయ న్యాయ సంహిత మహిళా సాధికారత లపై అవగాహన

- Advertisement -
- Advertisement -