- Advertisement -
మత్తు పదార్థాల నిర్మూలనపై అవగాహన ర్యాలీ
Awareness rally on de-narcotics
హైదరాబాద్
యువత మత్తు పదార్థాలను వీడి మంచి భవిష్యత్తు దిశగా ముందుకు సాగాలని కూకట్ పల్లి ఏసిపి శ్రీనివాసరావు, కేపీహెచ్బీ సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు. స్వచ్ఛ భారత్ అభియాన్ లో భాగంగా చైర్మన్ మాధవరం కాంతారావు ఆధ్వర్యంలో నిర్వహించిన మత్తు పదార్థాల నిర్మూలన ర్యాలీలో భాగంగా సే నోటు డ్రగ్స్ ర్యాలీలో పాల్గొని యువతకు అవగాహన కల్పించారు. మత్తు పదార్థాలకు బానిసగా మారి ఎంతోమంది యువత చెడిపోతున్నారని వాటి నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రజలందరూ కృషి చేయాలని సూచించారు. ప్రతి సంవత్సరం స్వచ్ఛ భారత్ అభియాన్ లో భాగంగా అవగాహన కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఈ నేపథ్యంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈ ర్యాలీని చేపట్టామన్నారు. దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉందని వారు దేశాన్ని మార్చే దిశగా ముందుకు వెళ్లాలి కానీ కొంతమంది చెడు వ్యసనాలకు బానిసగా అవుతున్నారని అలాంటివారు ఎవరైనా ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 1908 హెల్ప్ లైన్ నెంబర్ కు కాల్ చేసి సమాచారం అందించాలని వారికి కౌన్సిలింగ్ కూడా ఇచ్చేందుకు తమ సిద్ధంగా ఉన్నామని అన్నారు.
- Advertisement -