- Advertisement -
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ను కలిసిన బద్వేలు టిడిపి యువనేత రవికుమార్ నాయుడు
Badwelu TDP youth leader Ravikumar Naidu met Chief Minister Nara Chandrababu
బద్వేలు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాద పూర్వకంగా సచివాలయంలోని ఆయన ఛాంబర్లో గురువారం కలిసిన బద్వేలు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు చెరుకూరి రవికుమార్ నాయుడు. బద్వేల్ నియోజకవర్గ ప్రజల తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే రాయలసీమలోనే అత్యంత వెనుకబడిన నియోజకవర్గం బద్వేల్ అని, బద్వేల్ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరించాలని ముఖ్యమంత్రి నీ కోరడం జరిగింది.
బద్వేలు నియోజకవర్గ ప్రజల సమస్యల గురించి చంద్రబాబు నాయుడుకి వినతి పత్రం సమర్పించినట్లు తెలియచేసారు. ముఖ్యమంత్రి గారు కూడా శ్రద్దగా విని, అన్ని వివరాలు అడిగి తెలుసుకుని , పూర్తిస్థాయిలో బద్వేల్ నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తామని చెప్పడం జరిగింది అని రవి కుమార్ నాయుడు తెలిపారు
- Advertisement -