Monday, December 23, 2024

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలు.

- Advertisement -

చైనా ఆలోచనలను రాహుల్ గాంధీ అమలు చేస్తున్నరు
అందుకే బంగ్లాదేశ్ ఘటనపై నోరు విప్పడం లేదు
మువ్వెన్నెల జెండా మనందరి ఆత్మగౌరవ ప్రతీక
నెహ్రూ కుటుంబం  కోసం కుల, మత, ప్రాంతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టిన కాంగ్రెస్
అంబేద్కర్ ఆలోచనలను రూపుమాపేందుకు కాంగ్రెస్ కుట్ర
నెహ్రూ అరాచకాలవల్లే విభజన గాయాలు వెంటాడుతున్నాయి
స్వతంత్ర్య ఫలాలు అందరికీ అందాలన్నదే బీజేపీ లక్ష్యం
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలు.

Bandi Sanjay Kumar, Union Minister of State for Home Affairs.


కరీంనగర్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చైనా ఆలోచనలను అమలు చేసే వ్యక్తి అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. చైనా ఆదేశాలతోనే బంగ్లాదేశ్ ఘటనపై రాహుల్ గాంధీ నోరు విప్పడం లేదని విమర్శించారు. నెహ్రూ కుటుంబానికి రాజకీయ లబ్ది కోసం దేశ మహనీయుల త్యాగాలను కనుమరుగు చేసే కుట్ర చేస్తున్నారని, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆలోచనను తెరమరుగు చేస్తున్నారని మండిపడ్డారు. స్వతంత్ర్య ఫలాలు అందరికీ అందాలనే లక్ష్యంతోపాటు మహనీయుల త్యాగాలను స్మరించుకునేందుకు ‘హర్ ఘర్ తిరంగా’ పేరిట కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు.
భారతీయ యువ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు కరీంనగర్ లోని తెలంగాణ చౌక్ నుండి భారీ ఎత్తున ‘హర్ ఘర్ తిరంగా’ యాత్రను ప్రారంభమైంది. బండి సంజయ్ ఈ యాత్రకు విచ్చేసి తెలంగాణ చౌక్ నుండి టవర్ సర్కిల్ వరకు నడిచారు. భారీ ఎత్తున తరలివచ్చిన యువకులు, విద్యార్థులు మువ్వెన్నెల జెండాను చేత పట్టుకుని మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ కదం తొక్కారు. బండి సంజయ్ తో కలిసి అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు సాగారు.
అంతకుముందు బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ  ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపు మేరకు బీజేవైఎం ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా యాత్రను నిర్వహిస్తున్నాం. ఇంటిపైన జాతీయ జెండాను ఎగరేయడం, సెమినార్లు నిర్వహించడం, దేశం కోసం త్యాగం చేసిన మహనీయుల విగ్రహాలను శుద్ధి చేసి పుష్పార్చన చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మూడు రంగుల జాతీయ జెండా…మనందరి ఆత్మగౌరవ పతాకం. జెండా, ఎంజెడాలను పక్కనపెట్టి చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమ తమ ఇండ్లపై మువ్వెన్నల జెండాను ఎగరేయండి. దేశభక్తుల ఫొటోలును పంద్రాగస్టు వరకు వాట్సప్ డీపీలుగా పెట్టుకోండి.
ఈ దేశాన్ని గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేద్కర్. అట్లాగే ఎంతో మంది మహనీయులు దేశం కోసం బలిదానం చేశారు. కాంగ్రెస్ నేతలు మాత్రం నెహ్రూ కుటుంబానికి లబ్ది చేయడమే లక్ష్యంగా చరిత్రను తెరమరుగు చేసే యత్నం చేసింది. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కాలని చూస్తోంది. అంబేద్కర్ ఆలోచనలు లేకుండా చేయాలని కుట్ర చేస్తోంది. కుల, మత, ప్రాంతాల పేరుతో ప్రజలను చీల్చే కుట్రలు చేస్తోంది. నెహ్రూ అరాచక, అనాలోచిత విధానాలవల్ల విభజన గాయాలు ఇంకా మనల్ని వెంటాడుతున్నాయి. ఆనాడు లక్షల మంది చనిపోయారు. కోట్లాది మంది నిరాశ్రయులయ్యారు.
ఇవన్నీ గుర్తు చేయడంతోపాటు మహనీయులను స్మరించుకునేందుకు తిరంగా యాత్ర చేస్తున్నం. అంబేద్కర్ స్పూర్తితో మోదీ పాలనను కొనసాగిస్తున్నారు. 370 ఆర్టికల్ పేరుతో కాశ్మీర్  దేశంలో అంతర్భాగం కాకుండా కాంగ్రెస్ కుట్ర చేస్తే… మోదీ 370 ఆర్టికల్ ను రద్దు చేసి కాశ్మీర్ భారత్ లో అంతర్బాగమని నిరూపించిన వ్యక్తి మోదీ.
రాహుల్ గాంధీ మాత్రం అంకుల్ శ్యాం పిట్రోడా వాడుతున్న అమెరికా భాషను ఉపయోగిస్తున్నడు. చైనా ఆలోచనను అమలు చేసే వ్యక్తి రాహుల్ గాంధీ. బంగ్లాదేశ్ పై రాహుల్ నోరెందుకు విప్పడు? చైనా వద్దన్నది రాహుల్ నోరు మూసుకున్నడు..
కాంగ్రెస్ చేస్తున్న ఇట్లాంటి కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే… దేశ స్వాతంత్ర్యం కోసం మహనీయులు చేసిన త్యాగాలను గుర్తు చేసేందుకే  మోదీ నాయకత్వంలో కేంద్రం ప్రతి ఏటా తిరంగా పండుగ కార్యక్రమాలు నిర్వహిస్తున్నం.  దేశ స్వాతంత్ర్యం వచ్చింది కాంగ్రెస్ కోసం కాదు… అందరి కోసం… రాజ్యాంగ ఫలాలు నెహ్రూ కుటుంబం కోసమే కాదు… ప్రతి ఒక్కరివి. ఈ దేశంలో ఉన్న అట్టడుగునున్న పేద వాడికి సైతం రాజ్యాంగ ఫలాలు అందాలన్నదే అంత్యోదయ సిద్ధాంతం. ఇవన్నీ స్మరించుకుంటూ మహనీయుల ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలనే సంకల్పంతోనే నిర్వహిస్తున్న ఈ తిరంగా పండుగను విజయవంతం చేయాలని కోరుతున్నానని అన్నారు. తెలంగాణ ప్రజలంతా తక్షణమే మీ ఫోన్ వాట్సప్ డీపీలను మార్చండి. దేశభక్తుల ఫొటోలు, మువ్వెన్నెల జెండాను డీపీలుగా పెట్టుకోవాలి. ప్రతి భారతీయుడు తమ తమ ఇండ్లపై మువ్వన్నెల జెండాను ఎగరేయాలి. ఈ విషయంపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించేందుకు భారతీయ యువ మోర్చా ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నామని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్