డబుల్ బెడ్ రూమ్ ల  మౌళిక వసతుల పనులు పూర్తి చేయాలి- జిల్లా కలెక్టర్  కోయ శ్రీ హర్ష

- Advertisement -

డబుల్ బెడ్ రూమ్ ల  మౌళిక వసతుల పనులు పూర్తి చేయాలి- జిల్లా కలెక్టర్  కోయ శ్రీ హర్ష

Basic facilities of double bedroom rooms should be completed-District Collector Koya Shri Harsha

పెద్దపల్లి

రెండు పడక గదుల ఇండ్ల వద్ద లబ్ధిదారులకు అవసరమైన మౌళిక సదుపాయాల కల్పన పనులు  మార్చి మొదటి వారం లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్  కోయ శ్రీ హర్ష అన్నారు.శనివారం జిల్లా కలెక్టర్  కోయ శ్రీ హర్ష పెద్దపల్లిలోని కూనారం రోడ్డు సమీపంలో  నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయాన్ని మ సందర్శించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనులను పూర్తిస్థాయిలో పరిశీలించిన కలెక్టర్, అక్కడ మౌలిక వసతుల  నిర్మాణ పనుల పురోగతి వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ కూనారం రోడ్డు వద్ద గల డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం వద్ద మౌలిక వసతుల కల్పన పనులు దాదాపు పూర్తయ్యాయని, చివరి దశ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. డబల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదా యం వద్ద లబ్ధిదారులకు అవసరమైన  విద్యుత్ సరఫరా, త్రాగు నీటి సరఫరా, డ్రైయినేజ్ పనులు  వేగవంతం గా పూర్తి కావాలని, మార్చి మొదటి వారం నాటికి పెండింగ్ పనులు పూర్తి చేసి లబ్ధిదారుల కు ఇండ్లు అప్పగించేందుకు సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ  పర్యటనలో కలెక్టర్ వెంట పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, ఏ.ఈ,సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular