- Advertisement -
ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలి–జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్
Better medical services should be provided to the people--District Collector B, Satya Prasad
జగిత్యాల,
ప్రజలకు మెరుగైన సేవలందిస్తూ వైద్య సేవలు మరింత విస్తృతపరచాలని జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్ వైద్యులకు సూచించారు.
శుక్రవారం రోజున జిల్లా ప్రధాన ఆసుపత్రినీ జరుగుతున్న పలు మరమ్మత్తుల పనులను క్షేత్రస్థాయిలో కలెక్టర్ పరిశీలించారు.
జిల్లా ప్రధాన ఆస్పత్రిలో సెప్టిక్ ట్యాంక్, పెయింటింగ్ వర్క్స్ టాయిలెట్ , డ్రైనేజీ వాటర్ ప్లాంట్ పనుల పురోగతిని క్షేత్రస్థాయి లో పరిశీలించారు.
అలాగే ప్రధాన ఆస్పత్రిలో ఎమర్జెన్సీ విభాగం, పలు వార్డులను విభాగంలో సందర్శించి రోగులకు అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు.
ఎమర్జెన్సీ విభాగం పలు వార్డుల్లోని రిజిస్టర్లను రికార్డులను పరిశీలించారు.
వంటగది స్టోర్ రూమ్ బియ్యం ముడి సరుకులు కూరగాయలు నాణ్యమైనవి అందించాలని సూచించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రధాన ఆస్పత్రిలో జరుగుతున్న సెప్టిక్ ట్యాంక్, కలర్స్ డ్రైనేజీ, టాయిలెట్స్ పనుల పురోగతి పరిశీలించడం జరిగిందని. ఈ నెల చివరి వరకు పనులను వేగవంతంగా చేస్తూ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. అంతకుముందు జిల్లా కలెక్టర్, ఆర్డీవో తో కలసి బీర్పూర్ మండల కేంద్రంలోని పల్లె దవఖాన, సబ్ సెంటర్ ని
అకస్మిక తనిఖీ చేశారు.ఈ సంధర్భంగా
రిజిస్టర్ ,రికార్డును ఫార్మసీ మందులను కలెక్టర్ పరిశీలించారు.
ఆసుపత్రిలో వైద్య సేవలను మెరుగైన సేవలను అందించాలని సూచించారు.
అలాగే రోజు ఓపి సేవలు ఎంతా మందికి అందిస్తున్నారు అని వివరాలు తెలుసుకున్నారు.
డాక్టర్ సమయ పాలన పాటించాలని సూచించారు.ఆసుపత్రికి వచ్చిన పేషంట్ శుభ్రమైన త్రాగునీరు అందించాలని సూచించారు..
కలెక్టర్ వెంట, ఆర్డీవో మధు సుధన్,
ఎమ్మార్వోలు, ఎంపీడీఓ,
మున్సిపల్ కమిషనర్, చిరంజీవి ఆర్ ఎంఓ , సుమన్, ఆస్పత్రి సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
- Advertisement -