పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి, టిఆర్ఎస్ లను ఓడించాలి. వై వి సూర్యాపేట,మే7 (వాయిస్ టుడే ప్రతినిధి). మే 13 న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో, మతోన్మాద బిజెపి, అవినీతి బిఆర్ఎస్,లను ఓడించి ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని, రైతు సంఘం సీనియర్ నాయకులు ఏనుగుల వీరాంజనేయులు కోరారు. పార్లమెంట్ సాక్షిగా ఢిల్లీలో, అఖిల భారత నాయకులతో, రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చిన హామీలు అమలు చేయని బిజెపి ని చిత్తు చిత్తుగా ఓడించాలని ,రైతు సంఘం సీనియర్ నాయకులు ఏనుగుల వీరాంజనేయులు పిలుపు ఇవ్వడం జరిగింది. సూర్యాపేట జిల్లా నడిగూడెం, మండలం రామాపురం లో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు మాతంగి వీరయ్య ,కృష్ణ సాగర్ పవన్, ఏనుగుల మోహన్ రావు ,ఏనుగుల వీరబాబు తదితరులు పాల్గొన్నారు.