- Advertisement -
ఫిబ్రవరి 19 నుండి 28వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు
Brahmotsavam of Sri Kapileswara Swamy from 19th to 28th February
తిరుపతి,
తిరుపతి శేషాచల పర్వతమూలంలో వెలసిన శ్రీ కపిలేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 19 నుండి 28వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ఇందులో భాగంగా ఫిబ్రవరి 18న శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమం జరుగనుంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఫిబ్రవరి 15న ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు.
ప్రతి రోజూ ఉదయం 7 నుండి 9 గంటల వరకు, తిరిగి రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.
- Advertisement -



