బాగ్ అంబర్ పేటలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఎన్నికల ప్రచారం
హైదరాబాద్ నవంబర్ 14: అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రజల మనసు గెలుచుకున్న పార్టీ బీఆర్ఎస్ అని అంబర్ పేట శాసనసభ్యులు కాలేరు వెంకటేష్ అన్నారు.మంగళవారం ఆయన బాగ్ అంబర్ పేట లోని శ్రీ మహంకాళి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి బుర్జు గల్లి, సకల బస్తీ, వాడల బస్తీ మరియు పోచమ్మ బస్తీల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచార పాద యాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కెసిఆర్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసిన సంక్షేమ పథకాలే తిరిగి మరోసారి కెసిఆర్ ప్రభుత్వ ఏర్పాటుకు గట్టిగా పునాదులు వేశాయని అంబర్పేట్ లో గానీ రాష్ట్రంలో కానీ బీఆర్ఎస్ గెలుపు ఆపే తరం కాంగ్రెస్ బిజెపి పార్టీలతో కాదని అన్నారు.కార్పొరేటర్ పద్మా వెంకట్ రెడ్డి , డీపీ రెడ్డి పద్మావతి రెడ్డి , డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షులు చంద్రమోహన్ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజలు, పార్టీ నాయకులు, మహిళా నేతలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఎమ్మెల్యే బస్తీ ప్రజలను కలుసుకొని, వారికి సీఎం కేసీఆర్ గారు చేసిన మేలును తెలిపి, నవంబర్ 30 న జరిగే ఎన్నికలలో బీఆర్ఎస్ కే ఓటు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.తెలంగాణా ఆత్మగౌరవాన్ని నిలిపిన బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటు వేసి, మళ్లీ కాలేరుకే పట్టం కడతామని వారు తెలిపారు.




