- Advertisement -
బాలుడి దారుణ హత్య
Brutal murder of a boy
నిర్మల్
నిర్మల్ రూరల్ మండలం చిట్యాల గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అడ్డిగ రిషి(14) అనే బాలుడిని ని గ్రామ చెరువు శివారులో బండరాలతో కొట్టి గుర్తు తెలియని వ్యక్తులు దారుణహత్య కు పాల్పడ్డారు. సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ జానకి షర్మిల పరిశీలించారు. డాగ్ స్క్వాట్స్, క్లూస్ టీమ్ రప్పించి ఆధారాలు సేకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రామస్తుల సమాచారం మేరకు సంఘటన స్థలాన్ని పరిశీలించినట్లు తెలిపారు. హత్యకు పాల్పడ్డ నిందితులను వెంటనే పట్టుకుంటామని తెలిపారు. ఆమె వెంట ఏ ఎస్ పి రాజేష్ మీనా, పోలీసు అధికారులు ఉన్నారు.
- Advertisement -



