19న బడ్జెట్… 27 వరకు సమావేశాలు
Budget on the 19th... Meetings until the 27th
హైదరాబాద్, మార్చి 12
ర్చి
19న తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. మార్చి 27 వరకు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మార్చి 13న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభలో చర్చ జరగనుంది. మార్చి 14న హోలీ సందర్భంగా అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. మార్చి 17, 18 తేదీల్లో బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లులు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. మార్చి 21 నుంచి 26 వరకు పద్దులపై చర్చ జరగనుంది. మార్చి 22, 24, 25, 26 పద్దులపై, 27 ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరగనుంది.