Sunday, September 8, 2024

 ఎన్నికల బరిలో బన్నీ…

- Advertisement -

ఎన్నికల బరిలో బన్నీ…
ఏలూరు, డిసెంబర్ 22
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేడి మొదలైంది. ఇప్పటికే టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. ఈ క్రమంలో జనసేన పార్టీ నుంచి సినీ నిర్మాత బరిలోకి దిగబోతున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. అతడు మరెవరో కాదు.. ప్రముఖ నిర్మాత, ప్రముఖ నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్‌లో అల్లు అరవింద్‌తో పాటు పలు చిత్రాలు నిర్మించిన బన్నీ వాసు. ఆయన ఈ సారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం ఖాయం అని టాక్. అయితే బన్నీ వాసుకు జనసేన పార్టీతో అనుబంధం ఇప్పటిది కాదు. జనసేన ఆవిర్భావం నుండి బన్నీ వాసు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో చాలా దగ్గరగా పని చేస్తూ వస్తున్నారు. పార్టీకి బన్నీ వాసు పని చేస్తూ తన సూచనలు, సలహాలు ఇస్తూ ఉంటారని తెలుస్తోంది.కానీ, ఎప్పుడూ ప్రత్యక్షంగా అతను పని చేస్తున్నట్లు ప్రచారాల్లో గానీ, బయట వాళ్లకు గానీ తెలియదు. ఈ మధ్య కాలంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్.. బన్నీ వాసుకి పార్టీ ప్రచార బాధ్యతలు అప్పగించినట్లు అటు సినీ, ఇటు పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ నడుస్తోంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఆయన ఈసారి ఎన్నికల్లో జనసేన నుంచి బరిలోకి దిగబోతున్నట్లు టాక్. అయితే.. బన్నీ వాసు తన స్వగ్రామం అయిన పాలకొల్లు నుంచి పోటీ చేస్తారని వార్తలు వినిపించినప్పటికీ.. ఆయన పిఠాపురం నుండి ఎన్నికల్లో బరిలోకి దిగబోతున్నట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
==================

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్