విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీ సీఐడీ అధికారులు శనివారం నంద్యాలలో అరెస్ట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ అధికారులు అప్రమత్తం అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా బస్సులను ఎక్కడికక్కడే నిలిపి వేశారు. టీడీపీ నేతలు ఆందోళనలు చేపట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలో బస్సులకు నష్టం వాటిల్లకుండా ఉండేందుకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రధాన నగరాలు మరియు పట్టణాలలో భారీగా పోలీసులను మోహరించారు. టిడిపి ముఖ్య నేతలు, కార్యకర్తలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. బస్టాండ్ లలోనే ఆపేసి ఎటువంటి సంఘటనలు జరగకుండా చూస్తున్నారు.

టిడిపి అధినేత చంద్రబాబు ను అరెస్టు చేశారన్న వార్తల నేపథ్యంలో ఉమ్మడి కృష్ణాజిల్లా జిల్లా అంతటా హై అలర్ట్ జిల్లాలోని ప్రధాన నగరాలు మరియు పట్టణాలలో భారీగా పోలీస్ పహారా జిల్లా వ్యాప్తంగా టిడిపి ముఖ్య నేతలు కార్యకర్తలను హౌస్ అరెస్ట్ చేస్తున్న పోలీసులు జిల్లాలో బస్సు సర్వీసులను రద్దు చేసిన ఆర్టీసి డిపోలకే పరిమితమైన బస్సులు



