కాళేశ్వరంపై అసెంబ్లీలో కాగ్ నివేదిక.. వెలుగులోకి షాకింగ్ నిజాలు
అసెంబ్లీలో కాగ్ నివేదికను
డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క గురువారం ప్రవేశపెట్టారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కాగ్ రిపోర్టులో పలు సంచలన విషయాలను కాగ్ వెల్లడించింది. ‘కాళేశ్వరం వ్యయం భారీగా పెరిగినప్పటికీ ప్రయోజనాల్లో అదనపు పెరుగుదుల లేదు. విద్యుత్ వినియోగానికి ఏటా రూ.3,555 అదనపు వ్యయం పెరిగింది. రీ ఇంజినీరింగ్, మార్పుల వల్ల అప్పటికే చేసిన కొన్ని పనులు నిరర్థకం
అయ్యాయి. రీ ఇంజినీరింగ్ మార్పుల వల్ల రూ.765 కోట్ల నష్టం వాటిల్లింది. పనుల అప్పగింతలో నీటి పారుదల శాఖ అనుచిత తొందరపాటు ప్రదర్శించింది.
డీపీఆర్ ఆమోదానికి ముందే రూ.25 కోట్ల విలువైన 17 పనులు అప్పగించారు. డీపీఆర్ ఆమోదం తర్వాత కూడా ప్రాజెక్టు పనులు మార్పులు చేశారు. అవసరం లేకున్నా కాళేశ్వరం మూడో టీఎంసీ పనులు చేపట్టారు. అదనపు టీఎంసీ వల్ల రూ.25వేల కోట్ల అదనపు వ్యయం అయింది. సాగునీటిపై మూలధనం వ్యయం ఒక్కో ఎకరానికి రూ.6.42 లక్షలు అవుతుంది. ప్రాజెక్టు ప్రయోజన వ్యయ నిష్పత్తి 1.51గా అంచనా వేశారు. ప్రాజెక్టు ప్రయోజన, వ్యయ నిష్పత్తి 0.75గా తేలుతోంది. ప్రాజెక్టు ప్రయోజన, వ్యయ నిష్పత్తి మరింత తగ్గే అవకాశముంది. లోతైన భూకంప సంబంధిత అధ్యయనాలు చేయకుండానే మల్లన్న సాగర్ నిర్మించారని’ కాగ్ పేర్కొంది. కాగా తాజా కాగ్ రిపోర్టుతో గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం మరిన్ని చిక్కుల్లో పడినట్లయింది…..