సీబీఐ కోర్టు తీర్పు విదేశీ పర్యటనకు అనుమతి

- Advertisement -

జగన్, విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనలకు అనుమతి

CBI court ruling allows foreign travel
CBI court ruling allows foreign travel

హైదరాబాద్, ఆగస్టు 31:  విదేశీ పర్యటనలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీ సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి పెట్టుకున్న పిటిషన్లపై సీబీఐ కోర్టు తీర్పు ఇచ్చింది. ఇద్దరూ విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి మంజూరు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో వీరిద్దరూ  ఏ 1, ఏ 2 నిందితులుగా ఉన్నారు. గతంలో సీబీఐ అరెస్ట్ చేయడంతో బెయిల్ పై బయటకు వచ్చారు. బెయిల్ షరతుల్లో పాస్ పోర్టు కోర్టుకు సరెండర్ చేయాలని.. కోర్టు అనుమతితోనే విదేశాలకు వెళ్లాలన్న నిబంధన ఉంది. ఈ కారణంగా వారిద్దరి పాస్ పోర్టు కోర్టు అధీనంలో ఉంటుంది. విదేశీ పర్యటనకు వెళ్లాల్సినప్పుడల్లా కోర్టు అనుమతి తీసుకుంటూ ఉంటారు. తాజాగా జగన్, విజయసాయిరెడ్డి వేర్వేరుగా విదేశీ పర్యటనలకు వెళ్లాలని పిటిషన్లు దాఖలు చేశారు. సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. సీఎం జగన్మోహన్ రెడ్డి యూకే కు వ్యక్తిగత పర్యటనకు వెళ్లానున్నారు. సెప్టెంబర్ రెండు నంచి పన్నెండో తేదీ వరకూ ఆయన యూకే పర్యటనలో ఉండనున్నారు. యూకేలో సీఎం  జగన్ కుమార్తెలు చదువుకుంటున్నందున.. వారి దగ్గర  కొంత కాలం గడిపి రావాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ కారణంగా వ్యక్తిగత పర్యటన కోసం దరఖాస్తు చేసుకుని అనుమతి పొందారు. ఎంపీ విజయసాయిరెడ్డి వచ్చే ఆరు నెలల కాలంలో నెల రోజుల పాటు విదేశీ యూనివర్సిటీలతో ప్రభుత్వ ఒప్పందాల కోసం యూకే, యూఎస్, జర్మనీ, దుబాయ్, సింగపూర్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సీబీఐ కోర్టులో ఎంపీ విజయసాయిరెడ్డి సైతం పిటిషన్ దాఖలు చేశారు. విజయసాయిరెడ్డికి కూడా కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే వీరిద్దరి విదేశీ పర్యటనలకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ కోర్టులో వాదించింది.  జగన్‌, సాయిరెడ్డి దాఖలు చేసిన అభ్యర్థనలను తిరస్కరించాలని సిబిఐ విజ్ఞప్తి చేసింది. విదేశీ టూర్‌కు అనుమతివ్వొద్దని, సాక్షులను వీరు ప్రభావితం చేసే అవకాశముందని పీపీ కోర్టుకు వివరించారు. అయితే సీబీఐ కోర్టు నుంచి జగన్, విజయసాయిరెడ్డిలకు అనుకూలమైన నిర్ణయం వచ్చింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular