కులగణన సర్వే తప్పుడు తడకలు కాకి లెక్కలు
Census Survey is a miscalculation
ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీలకు రిజర్వేషన్ లు కల్పించాలి
బోయినిపల్లి మండల మాజీ కో-ఆఫ్షన్ సభ్యుడు మహ్మద్ ఆజ్జూ
చొప్పదండి ని.వ.
రాష్ట్ర ప్రభుత్వం జరిపించిన కులగణన సర్వే తప్పుల తడకగా,
కాకి లెక్కలతో అశాస్త్రీయంగా ఉందని, రాజన్న సిరిసిల్ల జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని బోయినిపల్లి మండల బిఆర్ఎస్ నాయకుడు,మాజీ కో-ఆఫ్షన్ సభ్యుడు మహ్మద్ ఆజ్జూ అన్నారు.
కులగణన సర్వే పై బుధవారం మండల మీడియాకు ఓ ప్రకటనను విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పదేళ్లలో తెలంగాణ జనాభా కేవలం 2లక్షలు మాత్రమే పెరిగిందని ఈ ద్వారా పేర్కొనడం విడ్డూరంగా ఉందని బోయినిపల్లి మండల మాజీ కో-ఆఫ్షన్ సభ్యుడు మహ్మద్ ఆజ్జూ అన్నారు.తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 2014లో జరిపించిన SKS ప్రకారం బీసీలు (ముస్లింలలోని బీసీలు కాకుండా) 52% అని నిర్ధారణ కాగా,
అదిప్పుడు 46%శాతమేనని ప్రభుత్వం వెల్లడించడం,6% తగ్గించి చూపడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.బీసీల జనాభాను తగ్గించి చూపడమే కాక,ఈ తప్పులతడక సర్వే నివేదికను మంత్రిమండలిఆమోదించడం,చట్టసభల్
బీసీలలో అత్యధిక సంఖ్యలో ఉన్న మున్నూరుకాపు,యాదవ్,ముదిరాజ్,కు
అన్ని రంగాలలో తీవ్ర అన్యాయానికి గురవుతున్న బీసీలను బీఆర్ఎస్ మరింత సంఘటితపరుస్తూ న్యాయమైన హక్కులు,వాటా కోసం నిరంతరం పోరాడుతుందని అయన స్పష్టం చేశారు.