సిపిఎం,ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రతుల దగ్ధం
Central government budget copies were burnt under the auspices of CPM and Praja Sangha
-ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేక బడ్జెట్
-సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్
మంథని
మంథని పట్టణంలోని అంబేద్కర్ ప్రధాన చౌరస్తాలో సిపిఎం పార్టీ,ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్బంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్ మాట్లాడుతూ ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రంలోని వ్యవసాయ రంగానికి కార్మికులకు అట్టడుగు వర్గ దళిత జాతులకు విద్యార్థి లోకానికి తీరని నష్టం జరిగే విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టిందని ఈ బడ్జెట్ పూర్తిగా ప్రజావ్యతిరేక బడ్జెట్ అని సిపిఎం, ప్రజా సంఘాలైన వ్యవసాయ కార్మిక సంఘం ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ కెవిపిఎస్ హమాలీ కార్మిక సంఘ మరియు సిఐటియు నాయకులు పేర్కొన్నారు. దేశం లోని ప్రజలు 67శాతం ప్రజలు వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తుంటే రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని దేశంలోని రైతాంగం మొత్తం ఢిల్లీ కేంద్రంగా ఉద్యమాలు చేసినా కూడా మోడీ ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేదని వ్యవసాయ రంగానికి పూర్తిగా మొండి చెయ్యి చూపించి వ్యవసాయ సబ్సిడీలను పూర్తిగా ఎత్తి వేసే దిశగా అదేవిధంగా ఆహార భద్రత కు సంబంధించి అతి తక్కువ బడ్జెట్ కేటాయించారని ఎరువుల సబ్సిడీని కూడా బడ్జెట్లో తగ్గించారని సంవత్సరానికి 12 లక్షల రూపాయలకి ఇన్కమ్ టాక్స్ ఎత్తివేయడం వల్ల సామాన్య పేద వర్గాలకు ఒరిగేదేమీ లేదని కేవలం ఉన్నత వర్గాలకే ఈ బడ్జెట్ కేటాయించిందని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించకుండా రాష్ట్ర కార్మిక, రైతుల కు తీరని అన్యాయం చేశారని అదేవిధంగా విద్యా ఉద్యోగ ఉపాధి రంగాలకు దళితుల అభ్యున్నతి కొరకు ఈ బడ్జెట్ లో అతి తక్కువ కేటాయించడం ఆ వర్గాలకు అన్యాయం చేసినట్టేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఆర్ల సందీప్, డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు గోర్రెంకల సురేష్, కుల వివక్ష పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షులు మంథని లింగయ్య, దళిత నాయకులు బూడిద తిరుపతి, సిఐటియు నాయకులు, హమాలీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.