Sunday, September 8, 2024

సెంచరీ కోట్టిన ఉల్లిగడ్డ

- Advertisement -

న్యూఢిల్లీ, అక్టోబరు 28, (వాయిస్ టుడే):  ఉల్లిగడ్డ… ఎర్రగడ్డ.. ఆనియన్‌… పేరులో ఏముంది… ధర చూస్తేనే గుండె జల్లుమంటోంది. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని అంటారు. ఉల్లిగడ్డ లేకపోతే… వంట  మొదలవదు. ప్రతి కూరలో ఉల్లి మస్ట్‌గా ఉండాల్సిందే. వంటింట్లో ఉల్లిగడ్డ తరగని రోజు ఉండదు. అలాంటిది… ఇప్పుడు ఉల్లి కోయకుండా… కన్నీరు తెప్పిస్తోంది. సామాన్యుల  జేబులను మళ్లీ చిల్లు పెడుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న ఆనియర్‌ ధరలు… సామాన్యులకు అందేలా కనిపించడంలేదు.ఇటీవల కాలంలో టమాటా ధర గూబ గుయ్యిమనిపించింది. అప్పుడు సామాన్యులు టమాటా కొనలేక.. సబ్సిడీ కోసం క్యూ కట్టారు. ఇప్పుడు… ఉల్లిగడ్డ కొండెక్కింది.  రోజురోజుకూ రేటు పెరగడమే తప్ప… కిందికి దిగిరానని అంటోంది. ఇలా నిత్యావసరమైన ఉల్లిగడ్డ ధర పెరగడం సామన్యులకు భారంగా మారుతోంది. కేజీ రూ.10 నుంచి రూ.20 మధ్యలో ఉండే ఉల్లి.. ఇప్పుడు రూ.100 చేరువైంది. ఢిల్లీ మార్కెట్‌లో అయితే… కేజీ ఉల్లి సెంచరీ కొట్టేసింది. రిటైల్ ధర కేజీ ఉల్లిగడ్డలు 100 రూపాయలు పలుకుతున్నాయి.  ఇక…  హోల్‌సేల్‌ మార్కెట్‌లో దాదాపు 80 రూపాయలకు చేరింది ఉల్లి రేటు. ఇది ఆరంభం మాత్రమే అని… ఉల్లి ధర ఇంకా ఘాటెక్కుతుందని అంటున్నారు మార్కెట్‌  నిపుణులు. త్వరలోనే ఉల్లి రిటైల్ ధర కేజీ 150 రూపాయలు దాటే అవకాశం ఉంది చెప్తున్నారు. ఢిల్లీ సరిహద్దులోని నోయిడాలోనూ ఉల్లి ధర ఆకాశాన్నంటుతోంది. కేజీ ధర 100 రూపాయలకు చేరింది. నోయిడాలోని సెక్టార్ 88లో ఉన్న హోల్‌సేల్ మార్కెట్‌లో ఉల్లిపాయలు  కిలో 80 రూపాయల వరకు పలుకుతోంది. దీంతో షాపుల్లో కేజీ ఉల్లిగడ్డలను 100 రూపాయలకు అమ్ముతున్నారు. ఉల్లిగడ్డ ఉత్పత్తి తగ్గడం వల్లే ధర పెరిగిందని అంటున్నారు  వ్యాపారులు. మార్కెట్‌కు ఉల్లి రాక చాలా తగ్గిందని చెప్తున్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే… త్వరలోనే కేజీ ఉల్లిపాయలు 150 రూపాయల వరకు పలుకుతాయని అంచనా  వేస్తున్నారు. రవాణా ఖర్చులు కూడా పెరగడంతో…. ఆది కూడా ఉల్లి ధరలపై ప్రభావం చూపుతోంది. ఉల్లిపాయల ధర ఇప్పట్లో తగ్గే పరిస్థితి లేదంటున్నారు వ్యాపారులు. నెల  రోజుల్లో ధర ఇంకా పెరుగుతుందని… 200 రూపాయలకు చేరే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు.తెలుగు రాష్ట్రాల్లోనూ ఉల్లి ధర కేజీ 70రూపాయలు దాటింటి. హైదరాబాద్ బహిరంగ మార్కెట్‌లో ఉల్లిగడ్డల ధరలు కిలో 70 రూపాయలకుపైగా పలుకుతోంది. దీంతో హోటళ్లు,  పానిపూరి షాపుల్లో ఉల్లి వడ్డింపులను పరిమితం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఉల్లిగడ్డల ధరలు 70 నుంచి 80 వరకు చేరుకున్నాయి. ఖరీఫ్ సీజన్‌లో ఉల్లి పంట వేయడం ఆలస్యం కావడం కూడా ధరల పెరుగుదలకు ఒక కారణంగా చెప్తున్నారు. పంట ఆలస్యంతో.. ఉత్పత్తిలోనూ జాప్యం జరుగుతోంది.  డిమాండ్‌ తగ్గ ఉల్లి.. మార్కెట్‌కు చేరుకోవడంలేదు. రబీ సీజన్‌ వచ్చిన ఉల్లి పంట నిల్వలు కూడా అయిపోయాయి. ఈ పరిస్థితి వల్లే ఉల్లి రేట్లు అమాంతం పెరిగిపోతున్నాయని  చెప్తున్నారు మార్కెట్‌ అధికారులు. గత ఏడాది ఇదే నెలలో ఉల్లిగడ్డల ధరలు మార్కెట్‌లో కిలో 30 రూపాయల కన్నా తక్కువగా ఉండేవి.. కానీ ఇప్పుడు అంతకు రెట్టింపు ధరలతో ఉల్లి కొనుక్కునే పరిస్థితి వచ్చింది. ఉల్లి ధరలు భారీగా పెరగడం… సామాన్యులకు పెనుభారంగా మారింది

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్