- Advertisement -
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై నేతలకు చంద్రబాబు కీలక సూచనలు
Chandrababu's key instructions to leaders on graduate MLC elections
అమరావతి జనవరి 31
ఎన్డీయే పక్షాలతో సమన్వయ సమావేశాలు పెట్టుకుని ఎంఎల్ సి ఎన్నికలలో పని చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై నేతలకు కీలక సూచనలు చేశారు. ఎన్డియే కూటమి మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలతో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజశేఖర్, రాజేంద్రప్రసాద్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని పేర్కొన్నారు. ఏ ఎన్నిక వచ్చినా గెలిచినప్పుడే సుస్థిర పాలన ఉంటుందని, తొలిసారి గెలిచినా, కొత్తగా వచ్చిన నేతలు మరింత చిత్తశుద్ధితో పని చేయాలని సూచనలు చేశారు. రాత్రికి రాత్రే అన్నీ జరిగిపోతాయని చెప్పట్లేదని, గాడి తప్పిన వ్యవస్థలను సరిదిద్దుతున్నామని స్పష్టం చేశారు. త్వరలోనే 16,347 టీచర్ పోస్టులకు డిఎస్పి నోటిఫికేషన్ ఇస్తున్నామని చంద్రబాబు చెప్పారు.
- Advertisement -