స్వర్ణాంధ్ర సాధన దిశగా రాష్ట్రంలో చంద్రబాబు పాలన
Chandrababu's rule in the state towards the achievement of Golden Andhra
ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటుంది
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన లో కీలకమైన అభివృద్ధి ప్రకటన చేస్తారు
ఐదు రూపాయలతో పేదలకు వైసిపి ప్రభుత్వం అన్నం పెట్టలేకపోయింది
కూటమి ప్రభుత్వ పాలన చూసి ఓర్వలేక వైసిపి నాయకులు బురద జల్లుతున్నారు
—–
తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్
ఆముదాలవలస:
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్ర సాధన దిశగా పయనిస్తోందని.. తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ అన్నారు. సోమవారం మధ్యాహ్నం ఆముదలవలస లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజల అకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. ముఖ్యంగా ఎన్నికల హామీల లో భాగంగా సామాజిక పింఛన్లను 3000 నుంచి 4000 రూపాయలకు పెంపు, ఐదు రూపాయలకే పేదలకు అన్నం పెట్టి ఆకలి తీరుస్తున్న అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తెచ్చిందన్నారు. గత దీపావళి నుంచి… ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ ల పంపిణీ కూడా ప్రారంభించింది అన్నారు.గత వైసీపీ ప్రభుత్వం అనుసరించిన వైఖరి కారణంగా ఖజానా ఖాళీ అయినప్పటికీ.. చంద్రబాబు నాయుడు ముందు చూపు , పరిపాలన దక్షతతో రాష్ట్రంలో పరిస్థితులు క్రమంగా చక్కబడుతున్నాయన్నారు. వైసిపి ప్రభుత్వం లో జీతం ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితిలో కొట్టుమిట్టాడిన.. ప్రభుత్వ ఉద్యోగులకు ఖచ్చితంగా ఒకటో తేదీనే జీతాల చెల్లింపు కొనసాగుతోందన్నారు. తాజాగా విద్యార్థులకు కూడా బడి భోజనం పథకం జనసేన విజ్ఞప్తితో డొక్కా సీతమ్మ పేరిట ప్రారంభమైందన్నారు. మరో వైపు విశాఖతో రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందే విధంగా కార్యచరణను కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.