- Advertisement -
యువతి పేరుతో చాటింగ్
Chatting with the name of a young woman
పార్ట్ టైం జాబ్ అంటూ యువకుడికి టోకరా
రూ.1.16 లక్షలు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
తాండూరు
పార్ట్ టైం జాబ్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ యువకుడికి టోకరా వేశారు. మాయ మాటలు చెప్పి అతని నుంచి నగదును కొట్టేశారు. మోసపోయానని గ్రహించిన సదరు యువకుడు వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ పోలీసులను ఆశ్రయించాడు.తాండూర్ డీఎస్పీ బాల కృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. . తాం డూరు పట్టణానికి చెందిన ఓ యువకుడికి పార్ట్ టైం జాబ్ చేసి డబ్బులు సంపాదించవచ్చని టెలిగ్రాం చానల్ ద్వారా హరతి అనే యువతి పేరుతో మెసేజ్లు వచ్చాయి. టాటా ప్రాజెక్టుకు సంబంధించిన 20 ప్రాపర్టీస్ ను ప్రమోట్ చేస్తే రూ.1000 వస్తుం దని నమ్మబలికింది. ఏకంగా ప్రముఖ కంపెనీ టాటా పేరుతో జాబ్ ఆఫర్ రావడంతో యువకుడు నమ్మాడు. తన వివరాలతో పాటు బ్యాంకు ఖాతా నంబర్ కూడా ఇచ్చాడు. మొదట్లో రూ.1000 చొప్పున యువకుడి ఖాతాలో వేశారు. అయితే పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలంటే కంపెనీకి కొం త నగదు చెల్లించాలని చెప్పారు. దీంతో పలు దఫాలుగా రూ.1.16 లక్షలు వారికి సమర్పించాడు.ఆ తర్వాత అతని ఖాతాలోకి ఒక్కపైసా కూడా జమ కాకపోవడంతో మోసపోయానని గ్రహించాడు. ఈ మేరకు గురువారం స్థానిక డీఎస్పీ బాలకృష్ణారెడ్డికి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. సైబర్ నేరగాళ్లు అనేక మార్గాల్లో నగదు కొట్టేస్తున్నారని, తెలియని వారి నుంచి ఎలాంటి ఆఫర్లు వచ్చినా, ఓటీపీలు అడిగినా ఇవ్వరాదని అన్నారు. మోసపోయినట్లు గ్రహిస్తే వెంటనే పోలీసులను ఆశ్రయించాలన్నారు
- Advertisement -