- Advertisement -
చోరికొచ్చి….మందేసి…వచ్చిన పని మరిచిపోయిన దొంగ
Choricochi....Mandesi...a thief who forgot his work
నార్సింగి
మద్యం షాపులో దొంగతనానికి వచ్చిన ఒక దొంగ ఫుల్లుగా మద్యం తాగి నిద్ర పోయాడు. నార్సింగిలోని కనకదుర్గ వైన్స్ లో ఘటన జరిగింది. ఆదివారం రాత్రి వైన్ షాపు మూసేసి యజమాని ఇంటికి వెళ్లిపోయాడు. ఒక దొంగ దొంగతనానికి వచ్చి కౌంటర్ లో నగదు, మద్యం బాటిళ్లు ఓ సంచిలో మూట కట్టుకున్నాడు. దొంగతనం తర్వాత వెళ్ళేటప్పుడు మద్యం తాగడంతో మత్తులోనే నిద్రపోయాడు. సోమవారం షాపు తెరిచి చూడగా వైన్ షాపులో నిద్రపోయి ఉన్న దొంగ కనబడ్డాడు.
- Advertisement -